Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్. కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా కాపిటల్ హింస కేసులో కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

Donald Trump

Colorado Supreme Court : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా కాపిటల్ హింస కేసులో కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కొలరాడో రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలట్ లో పోటీ చేయకుండా ట్రంప్ పై కోర్టు అనర్హత వేటు వేసింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హుడని 4-3 మెజార్టీతో జడ్జీలు తీర్పు ఇచ్చారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 ప్రకారం అధ్యక్ష అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే, ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ట్రంప్ కు కోర్టు కల్పించింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది.

Also Read : Ayodhya Ram Temple : రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ పూజ ఎవరు నిర్వహిస్తారంటే…

క్యాపిటల్ భవనంపై దాడి కేసు..
కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చి 5న జరిగే కొలరాడో రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలట్ పై మాత్రమే కాకుండా, వచ్చే ఏడాది నవంబర్ 5న జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తరువాత 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించిన కారణంగా.. అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం కొలరాడో ఈ తీర్పు ఇచ్చింది.

Also Read : IPL auction 2024 : పాపం స్మిత్.. కనీస ధర రూ.2కోట్లు దెబ్బకొట్టిందా? వేలంలో అమ్ముడుపోని స్టార్ ప్లేయర్స్ వీళ్లే

కోర్టు ఏం చెప్పిదంటే..
మేము ఈ నిర్ణయానికి కాజువల్ గా రాలేదు. మా ముందు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో మాకు తెలుసు. చట్టాన్ని అమలు చేయడంలో మా కర్తవ్యంలో మేముకూడా దృఢంగా ఉన్నాము, మేము నిర్ణయాలు ఇస్తున్నాము. కొంత భయం, పక్షపాతం కారణంగా మా నిర్ణయం ఎలాంటి ప్రతిచర్యను తెస్తుందనే దానిగురించి మేము ఆందోళన చెందడం లేదు. చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని మేము దీన్ని చేస్తున్నామని పేర్కొంటూ కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.

వివేక్ రామస్వామి స్పందిస్తూ..
అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ ను అనర్హుడిగా కోర్టు ప్రకటించిన కొద్ది గంటలకు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి కీలక ప్రకటన చేశారు. కోర్టు ట్రంప్ ను మళ్లీ బ్యాలెట్ లో చేర్చకపోతే వెంటనే కొలరాడో ఎన్నికల నుండి వైదొలగాలని రాస్వామి ఇతర రిపబ్లికన్ అభ్యర్థులను కోరారు. రామస్వామి ట్వీట్ ప్రకారం.. ట్రంప్ ను కూడా బ్యాలెట్ లో అనుమతించే వరకు కొలరాడో జీఓపీ ఫ్రైమరీ బ్యాలెట్ నుంచి ఉపసంహరించుకుంటానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాన్ డిసాంటిస్, క్రిస్ క్రిస్టీ, నిక్కీ హెలీ వెంటనే అదేచేయాలని నేను కోరుతున్నాను అని ఎక్స్ (ట్విటర్ ) ఖాతాలో వివేక్ రామస్వామి అన్నారు.