Ayodhya Ram Temple : రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ పూజ ఎవరు నిర్వహిస్తారంటే…

అయోధ్యలోని శ్రీ రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ పూజ ఎవరు నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణం, నిర్వహణను చూసేందుకు ఏర్పాటు చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అనే ట్రస్ట్ బుధవారం రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించిన కీలక వివరాలను పంచుకుంది....

Ayodhya Ram Temple : రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ పూజ ఎవరు నిర్వహిస్తారంటే…

Lord Ram Idol

Updated On : December 20, 2023 / 8:58 AM IST

Ayodhya Ram Temple : అయోధ్యలోని శ్రీ రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ పూజ ఎవరు నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణం, నిర్వహణను చూసేందుకు ఏర్పాటు చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అనే ట్రస్ట్ బుధవారం రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించిన కీలక వివరాలను పంచుకుంది. మకర సంక్రాంతి తర్వాత జనవరి 16వ తేదీ నుంచి జనవరి 22వతేదీ వరకు నిర్వహించే పవిత్రోత్సవాలకు సంబంధించిన ఆచారాలు ప్రారంభమవుతాయని ట్రస్ట్ తెలిపింది.

ALSO READ : Covid-19 JN.1 : కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ వల్ల ప్రమాదం లేదు…ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

రామ లాలా విగ్రహాలను శిల్పులు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, సత్యనారాయణ పాండే తయారు చేస్తున్నారు. కాశీ నుంచి గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ జీ, లక్ష్మీకాంత్ దీక్షిత్ జీ ప్రాణ్ ప్రతిష్ఠా పూజను నిర్వహిస్తారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అనే ట్రస్ట్ తెలిపింది. ప్రతిష్ఠాపన కార్యక్రమం అనంతరం విశ్వప్రసన్న తీర్థ జీ నేతృత్వంలో 48 రోజుల పాటు మండల పూజలు జరుగుతాయని ట్రస్ట్ పేర్కొంది.

ALSO READ : Bharat Jodo Yatra : 2024 జనవరి నుంచి కాంగ్రెస్ భారత్ జోడోయాత్ర 2

భక్తులకు, అతిథులకు భోజనం పెట్టేందుకు పట్టణంలోని ప్రతి కూడలిలో లంగర్లు, కమ్యూనిటీ కిచెన్‌లు, ఆహార పంపిణీ కేంద్రాలు, భోజన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి శంకరాచార్యులు, మహామండలేశ్వరులు, సిక్కు, బౌద్ధ సంఘాల అగ్ర ఆధ్యాత్మిక నాయకులకు ఆహ్వానాలు పంపించారు.

ALSO READ : Heavy Rain : తమిళనాడులో భారీవర్షాలు, వరదలు…10 మంది మృతి

వీరితోపాటు 4వేల మంది సాధువులు ఈ పూజల్లో పాల్గొంటారని ట్రస్ట్ వివరించింది. వామిని నారాయణ్, ఆర్ట్ ఆఫ్ ఆర్ట్ ,వివిధ రంగాలకు చెందిన ముఖ్య వ్యక్తులు. లివింగ్, గాయత్రి పరివార్, మీడియా హౌస్‌లు, క్రీడలు, రైతులు, కళాకారులను పూజ కార్యక్రమానికి ఆహ్వానించారు.