Heavy Rain : తమిళనాడులో భారీవర్షాలు, వరదలు…10 మంది మృతి

తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల 10 మంది మృతి చెందారు. గత రెండు రోజులుగా తమిళనాడు దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది....

Heavy Rain : తమిళనాడులో భారీవర్షాలు, వరదలు…10 మంది మృతి

Heavy Rains

Updated On : December 20, 2023 / 6:32 AM IST

Heavy Rain : తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల 10 మంది మృతి చెందారు. గత రెండు రోజులుగా తమిళనాడు దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తిరునెల్వేలి, టుటికోరిన్‌ జిల్లాల్లో వర్షాల కారణంగా 10 మంది మరణించగా, గోడ కూలి కొందరు, విద్యుదాఘాతంతో మరికొందరు మరణించారని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా తెలిపారు.

రెండు రోజుల్లో 115 సెంటిమీటర్ల వర్షపాతం

అతి భారీవర్షాలపై భారత వాతావరణశాఖ తప్పుడు అంచనాలు వేసింది. తమిళనాడులో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు చెప్పారని, కాని టుటికోరిన్ జిల్లాలోని ఒక మున్సిపాలిటీలో రెండు రోజుల్లో 115 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని తమిళనాడు అధికారులు చెపుతున్నారు. తిరునెల్వేలి, టుటికోరిన్‌లలో రికార్డు స్థాయిలో వర్షపాతం కురవడంతో వరదలు వెల్లువెత్తాయి. 30 గంటల్లో కాయల్‌పట్టినంలో 1,186 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వరదలతో అతలాకుతలం 

తిరుచెందూర్‌లో 921 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. టుటికోరిన్‌లో చాలా ప్రదేశాలు,తామిరభరణి నది ఒడ్డున ఉన్న గ్రామాలు వరదల కారణంగా దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. నేవీ, ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తో సహా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన 1,343 మంది సిబ్బంది రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారని శివదాస్ మీనా చెప్పారు. ఇప్పటి వరకు 160 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు.

ALSO READ : Covid-19 JN.1 : కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ వల్ల ప్రమాదం లేదు…ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

17 వేల మందిని ఈ పునరావాస క్యాంపుల్లో ఉంచారు. 34 వేల ఫుడ్ ప్యాకెట్లను ప్రజలకు సరఫరా చేశామని, ఇప్పుడు కూడా నీటి మట్టం తగ్గకపోవడంతో కొన్ని గ్రామాలకు చేరుకోలేకపోతున్నామని చీఫ్ సెక్రటరీ చెప్పారు. తొమ్మిది హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. హెలికాప్టర్ల ద్వారా 13,500 కిలోల ఆహారాన్ని వరద బాధితులకు సరఫరా చేశారు. తిరునెల్వేలిలో 64,900 లీటర్లు, టుటికోరిన్‌లో 30,000 లీటర్లు పాలను సరఫరా చేశారు.

ALSO READ : Telangana Corona : తెలంగాణలో కరోనా టెన్షన్.. కొత్తగా ఎన్ని కేసులంటే.. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచన

కన్యాకుమారి, తెన్కాసి జిల్లాలలో విద్యుత్ సరఫరా పూర్తిగా పునరుద్ధరిస్తామని అధికారులు పేర్కొన్నారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో 323 పడవల్లో వదరల్లో చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు రంగంలోకి దిగామని, పొరుగు జిల్లాల నుంచి మరికొంత మంది సిబ్బందిని సహాయక చర్యలకు రప్పిస్తామని శివదాస్ చెప్పారు.సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు టుటికోరిన్ పరిసర ప్రాంతాల్లో అదనంగా 200 వైర్‌లెస్ సెట్‌లను మోహరించాలని పోలీసులకు సూచించామని శివదాస్ వివరించారు.