Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటమి తప్పలేదు. గెలుపు కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మెజార్టీ ఓట్లతో డెమాక్రాట్ అభ్యర్థి జో బైడెన్ 284 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ పై విజయం సాధించారు. ట్రంప్ కేవలం 214 ఎలక్టోరల్ ఓట్లతో ఓటమిపాలయ్యారు. గెలిచిన బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో బైడెన్ వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టనున్నాడు.
పరాజయం మూటగట్టుకున్న ట్రంప్.. తుది ఫలితాలకు ముందే రిగ్గింగ్, మోసాలకు పాల్పడ్డారంటూ డెమోక్రాట్ అభ్యర్థులపై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు. అయినప్పటికీ ఎన్నికల ఫలితాలు ట్రంప్ కు వ్యతిరేకంగా వచ్చాయి. దాంతో ఓటమితో ఒత్తిడిని తట్టుకునేందుకు ట్రంప్ చిన్నపిల్లాడిలా మారిపోయారు. గోల్ఫ్‌క్లబ్‌కి వెళ్లి గోల్ ఆడుతూ ట్రంప్ ఆహ్లాదంగా కనిపించారు.
వైట్ హౌస్ లోనే ఉంటానంటూ ట్రంప్ మారం చేసినట్టుగా ఉంది.. వైట్‌హౌస్ వీడాల్సిన సమయం ఆసన్నమైందంటూ ట్రంప్‌పై నెటిజన్లు సోషల్‌మీడియాలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
someone has made this pic.twitter.com/dRy3OoJ4Rf
— Jim Pickard (@PickardJE) November 5, 2020
హాలో.. ట్రంప్ నీ టైం ముగిసింది.. ఇక వైట్ హౌస్ వీడి వెళ్లిపో.. అంటే.. నో నేను వెళ్లనూ ఇక్కడే ఉంటానంటూ ట్రంప్ మారం చేస్తున్నట్టుగా ఫన్నీ వీడియోను క్రియేట్ చేశారు. Jim Pickard అనే ట్విట్టర్ యూజర్ ట్రంప్ వీడియోను పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది.