అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్.. భార్య, కూతురు, అల్లుడితో సహా

ప్రధాని మోడీ నిరీక్షణ ఫలించింది. అతిథి దేవో భవ అంటూ మోడీ మెలానియా ట్రంప్.. డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలికారు. కూతురు ఇవాంక ట్రంప్.. అల్లుడు జారేద్ కుష్నర్‌తో సహా భారత్‌లో విహరించేందుకు అడుగుపెట్టారు. ప్రముఖులంతా.. వీరికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. పది మిలియన్ మందిని ఏర్పాటు చేస్తానన్న మోడీ.. ఎంతవరకూ సక్సెస్ అయ్యారో మరి.. 

వీరి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి:
24-02-2020
AM 11:55 అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ట్రంప్‌
ఎయిర్‌పోర్ట్‌ నుంచి మోతెరా స్టేడియం వరకు ర్యాలీ
PM 12:30 మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం
PM 3:30 ఆగ్రా వెళ్లనున్న ట్రంప్
PM 5:10 తాజ్‌మహల్‌ సందర్శన
PM 7:30 ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ట్రంప్
మౌర్య హోటల్‌లో బస ట్రంప్‌ దంపతుల బస..

See Also>>అమెరికాలో ఇన్వెస్ట్ చేసిన భారతీయ సీఈఓలతో ట్రంప్ మీట్!

 

25-02-2020
AM 9:55 రాష్ట్రపతి భవన్‌కు ట్రంప్
AM 10:45 రాజ్‌ఘాట్‌లో నివాళులు
AM 11:25 హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ-ట్రంప్‌ ఉమ్మడి మీడియా సమావేశం
మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు
PM 12:55 అమెరికా ఎంబసీ సిబ్బందితో ట్రంప్‌ భేటీ
PM 8:00  రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు విందు
PM 10:00 అమెరికాకు బయల్దేరనున్న ట్రంప్