ఎన్నికల ఫలితాలపై కుట్ర…సుప్రీం కోర్టుకి వెళ్తా : ట్రంప్

donald trump on usa election counting అమెరికా ఎన్నికల ఫలితాలపై కుట్ర జరుగుతోందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్లను పక్కదారి పట్టించేందుకు కుట్ర జరిగిందని ట్రంప్ అన్నారు. సీట్లు కొల్లగొట్టాలనే డెమోక్రాట్ల ఎత్తులు ఫలించవని ట్రంప్ అన్నారు.

తాను సుప్రీం కోర్టుకెళ్లనున్నట్లు ట్రంప్ తెలిపారు.ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని..న్యాయపోరాటం చేస్తామని ట్రంప్ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా జరుగుతున్న ఓటింగ్ ఆగిపోవాలని ట్రంప్ అన్నారు. ఉదయం 4గంటల సమయంలో బ్యాలెట్లను వెతికి వాటిని లిస్ట్ లో కలపడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదని ట్రంప్ సృష్టం చేశారు. తాము ఇప్పటికే ఎన్నికల్లో గెలిచేశామని అన్నారు.



తమకు వస్తున్న ఫలితాలు అద్భుతమని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమకు ఊహకందని ఫలితాలు వస్తున్నాయన్నారు. తనకు అద్భుతమైన మద్దతు ఇచ్చినందుకు అమెరికా ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్లు ట్రంప్ తెలిపారు. ఎన్నికల్లో గెలవబోతున్నామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఎన్నికల్లో గెలిచేశామని ట్రంప్ తేల్చేశారు. కీలకమైన టెక్సాస్,ఫ్లోరిడా,జార్జియా రాష్ట్రాల్లో విజయం సాధించామన్నారు. గెలుపు సంబరాలకు రిపబ్లికన్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. తనను ఓడించే ప్రయత్నాల్లో డెమోక్రాటిక్ పార్టీ విఫలమయిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు