Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై పొగడ్తల వర్షం కురిపించారు. అదికూడా.. పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ను పక్కన పెట్టుకొని. అంతేకాదు.. పాక్ ప్రధాని వైపు చూస్తూ ట్రంప్ భారత్ దేశం గొప్ప దేశం అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాకిస్థాన్ ప్రధానిసైతం నవ్వుతూ ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గాజాలో దాదాపు రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించిన తరువాత ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్ నగరంలో జరిగిన ప్రపంచ నాయకుల శిఖరాగ్ర సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ట్రంప్ తోపాటు పాకిస్థాన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, మరికొన్ని దేశాల అధ్యక్షులు కూడా పాల్గొన్నారు.
Also Read: నాలుగు వైపులా సంక్షోభం.. పాకిస్థాన్ ఇక ముక్కలవుతుందా? అట్టుడుకుతోంది..
డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఆయన వెనుకాలే నిలబడి ఉన్నాడు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతదేశం చాలా గొప్ప దేశం, నాకు అత్యంత మిత్రదేశం. నాకు చాలా మంచి స్నేహితుడు నాయకత్వం వహిస్తున్నాడు. భారత్ గొప్ప పనులెన్నో చేసింది. ఇకమీదట పాకిస్థాన్, భారత్ దేశాలు ఇరుగుపొరుగున కలిసిమెలిసి ఉంటాయని ఆశిస్తున్నా.. అంటూ తన వెనుకాలే ఉన్న పాకిస్థాన్ ప్రధానివైపు చూస్తూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో పాక్ ప్రధాని షరీఫ్ నవ్వుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#WATCH | Egypt | US President Donald Trump says, “India is a great country with a very good friend of mine at the top and he has done a fantastic job. I think that Pakistan and India are going to live very nicely together…”
(Video source: The White House/YouTube) pic.twitter.com/rROPW57GCO
— ANI (@ANI) October 13, 2025
అంతకుముందు పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ రోజు చరిత్రలో గొప్ప రోజులలో ఒకటి.. ఎందుకంటే ట్రంప్ నేతృత్వంలో అవిశ్రాంత ప్రయత్నాల తరువాత గాజాలో శాంతి సాధన అయింది. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి, శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు అంటూ కొనియాడారు. భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంతో పాటు కాల్పుల విరమణ సాధించడానికి ట్రంప్ అసాధారణ ప్రయత్నాలు చేశారని షాబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు. షరీఫ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బయిన ట్రంప్.. ఇది తాను ఊహించలేదన్నారు. ఇంకా తాను మాట్లాడేందుకు ఏమీ లేదంటూ.. ఇంటికి వెళ్దాం అంటూ చమత్కరించారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తం నవ్వులు విరిశాయి.
‘Let’s go home, there’s nothing more I have to say’
Trump is all praised out after Sharif’s speech
How rare is that? https://t.co/Zo8ahsSvmC pic.twitter.com/CviMIbkSlX
— RT (@RT_com) October 13, 2025