నాలుగు వైపులా సంక్షోభం.. పాకిస్థాన్‌ ఇక ముక్కలవుతుందా? అట్టుడుకుతోంది..

తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, పెరుగుతున్న ఉగ్రవాదం, వేర్పాటువాద ఉద్యమాలు పాకిస్థాన్ సమగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.

నాలుగు వైపులా సంక్షోభం.. పాకిస్థాన్‌ ఇక ముక్కలవుతుందా? అట్టుడుకుతోంది..

Updated On : October 13, 2025 / 9:34 PM IST

Pakistan: అఫ్ఘానిస్థాన్ హెచ్చరికలు, గాజా వివాదం, బలూచిస్థాన్‌లో తిరుగుబాటు, ఆర్థికంగా కుదేలు కావడం వంటి వాటితో ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. నలువైపులా సవాళ్లతో సతమతమవుతున్న పాక్‌ భవిష్యత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అఫ్ఘానిస్థాన్ నుంచి వస్తున్న హెచ్చరికలు ఒక వైపు, మరోవైపు గాజా ఒప్పందానికి మద్దతు పలకడంపై సొంత దేశంలోనే తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు పాక్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పాక్‌లో వేర్పాటువాద ఉద్యమాలు పెరుగుతున్నాయా? అన్న సందేహాలు వస్తున్నాయి. (Pakistan)

ఈ పరిస్థితులకు తోడు, “పక్కలో బల్లెం”లా మారిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) రోజుకో దాడితో పాకిస్థాన్‌ను చావుదెబ్బ కొడుతోంది. బలూచిస్థాన్‌లో నిరంతరం కొనసాగుతున్న ఈ తిరుగుబాటు దేశ భద్రతకు పెను సవాలుగా మారింది. అంతేకాకుండా, పాకిస్థాన్ సొంత గడ్డపైనే అనేక ప్రాంతాలలో వేర్పాటువాద ఉద్యమాలు ఇబ్బడిముబ్బడిగా నడుస్తున్నాయి.

ముక్కలయ్యే ప్రమాదం ఉందా?

ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే, పాకిస్థాన్ త్వరలో అనేక ముక్కలుగా విడిపోనుందా అనే ప్రశ్నలు బలపడుతున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, పెరుగుతున్న ఉగ్రవాదం, వేర్పాటువాద ఉద్యమాలు పాకిస్థాన్ సమగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ సవాళ్లను పాకిస్థాన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో, భవిష్యత్తులో ఈ దేశం ఏ దిశగా పయనిస్తుందో? దీనిపై విశ్లేషకులు చెబుతున్న మరిన్ని వివరాలు.