×
Ad

అమెరికా దాడుల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్‌ ఇలా చేసే ఛాన్స్‌: ట్రంప్‌

ఒప్పందం కుదిరితే మంచిదేనని, ఒకవేళ కుదరకపోతే ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.

Trump (Image Credit To Original Source)

  • ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్‌ భావించొచ్చు
  • అణు, క్షిపణి కార్యక్రమాలపై చర్చలకు గడువు ఇచ్చాను
  • సైనిక నౌకల బృందాన్ని ఇరాన్ సమీపంలోకి తరలిస్తున్నాం 

Donald Trump: ఇరాన్‌పై అమెరికా దాడులు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న వేళ యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక చర్యను ఎదుర్కోవడం కంటే ఒప్పందం కుదుర్చుకోవడమే మేలని ఇరాన్‌ భావించే అవకాశం ఉందని అన్నారు.

తాజాగా ట్రంప్‌ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. “ఇది మాత్రం చెప్పగలను, వారు ఒప్పందం కుదుర్చుకుందామనుకుంటున్నారు” అని అన్నారు. అణు, క్షిపణి కార్యక్రమాలపై చర్చలకు రావటానికి ఇరాన్‌కు గడువు ఇచ్చారా? అని ట్రంప్‌ను విలేకరులు అడిగారు. దీనికి ఆయన స్పందిస్తూ.. “అవును, ఇచ్చాను” అని చెప్పారు. ఎప్పటివరకు గడువు ఇచ్చారో వెల్లడించలేదు.

Also Read: పడిపోయిన గోల్డ్‌, సిల్వర్‌ ధరలు.. బులియన్‌ మార్కెట్‌లో ఎందుకీ పరిస్థితి తలెత్తింది? ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

అమెరికా సైనిక నౌకల బృందాన్ని ఇరాన్ సమీపంలోని సముద్ర ప్రాంతాలకు తరలిస్తోందని ట్రంప్ సూచించారు. ఒప్పందం కుదిరితే మంచిదేనని, ఒకవేళ కుదరకపోతే ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.

మానవ హక్కుల సంఘాల అంచనాల ప్రకారం.. ఇరాన్‌లో నిరసనల కారణంగా 6,000 మందికిపైగా మృతి చెందారు. అణు కార్యక్రమంపై ఒప్పందం కోసం ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి తీసుకువచ్చిన నేపథ్యంలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని ట్రంప్‌ రెండు రోజుల క్రితం కూడా తెలిపారు.

ఇరాన్‌ అణు కార్యక్రమం అణుబాంబు తయారీ లక్ష్యంతో సాగుతోందని తెలుస్తోంది. అయితే. శుక్రవారం ఇరాన్ దౌత్యవేత్త ఒకరు మాట్లాడుతూ.. తమ క్షిపణి రక్షణ సామర్థ్యాల విషయంలో అమెరికాతో ఎప్పటికీ చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.