×
Ad

Doomsday Clock 2026 : ప్రపంచం వినాశనానికి మరింత దగ్గరైందా..! డూమ్స్‌డే గడియారం ఏం చెప్పింది.. ఈ వాచ్ గురించి మీకు తెలుసా?

Doomsday Clock 2026 : వినాశనానికి మానవాళి ఎంత దూరంలో ఉందన్నది బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటటిస్ట్స్ విశ్లేషిస్తుంది. ఒక ఊహాజనిత గడియారంపై అర్ధరాత్రి 12గంటల సమయాన్ని వినాశనానికి సూచికగా అభివర్ణిస్తుంది.

Doomsday Clock

  • వినాశనానికి ప్రపంచం మరింత దగ్గరైందా!
  • అర్ధరాత్రికి ఇంకా చేరువైన డూమ్స్ డే గడియారం
  • మరో నాలుగు సెకన్ల మేర ముందుకు జరిపినట్లు సంస్థ వెల్లడి

Doomsday Clock 2026 : ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా విధ్వంసానికి చేరువైందా..? అంటే అవుననే చెప్పింది బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్ అనే స్వచ్చంద సంస్థ. అమెరికా, చైనా, రష్యా, ఇతర దేశాలు దుందుడుకుగా వ్యవహరించడం, శత్రుభావాలు, జాతీయవాదం పెరగడం వంటివి ఇందుకు కారణమని వివరించింది. దీంతో డూమ్స్‌డే గడియారంలో జనవరి 27వ తేదీ అర్ధరాత్రికి 85సెకన్ల దూరంలోనే సెట్ చేయబడింది.

Also Read : Dog Loyal: కన్నీళ్లు పెట్టించే దృశ్యం.. ప్రాణం తీసేంత చలిలోనూ.. 3రోజులు యజమాని శవం దగ్గరే శునకం

వినాశనానికి మానవాళి ఎంత దూరంలో ఉందన్నది బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటటిస్ట్స్ విశ్లేషిస్తుంది. ఒక ఊహాజనిత గడియారంపై అర్ధరాత్రి 12గంటల సమయాన్ని వినాశనానికి సూచికగా అభివర్ణిస్తుంది. దీన్ని డూమ్స్‌డే క్లాక్‌గా పిలుస్తున్నారు. దీనిని బులెటిన్ ఆఫ్ ది అటీమిక్ సైంటిస్ట్ అనే సంస్థ పర్యవేక్షిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ సమయాన్ని ముందుకు, వెనక్కి జరుపుతుంటుంది. గతేడాది గడియారాన్ని అర్ధరాత్రికి 89సెకన్లకు చేరువ చేసింది. అణ్వస్త్ర దేశాలతో ప్రమేయమున్న ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని సంస్థ తెలిపింది.

మొత్తానికి అణుయుద్ధం ముప్పు, వాతావరణ మార్పులు, బయోటెక్నాలజీని దుర్వినియోగం చేసే అవకాశం, సరైన నియంత్రణలు లేకుండా ఏఐ వాడకం వంటివి పెరిగాయని సంస్థ వివరించింది. ఈ నేపథ్యంలో డూమ్స్ డే గడియారంలోని సమయాన్ని అర్ధరాత్రికి మరో నాలుగు సెకన్ల మేర ముందుకు జరిపినట్లు వివరించింది.

డూమ్స్ డే క్లాక్ అంటే ఏమిటి?
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు అభివృద్ధికి కోడ్ నేమ్ అయిన మాన్‌హట్టన్ ప్రాజెక్టులో పనిచేసిన శాస్త్రవేత్తల బృందం, ఆలర్బర్ట్ ఐన్‌స్టీన్, చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం కలిసి 1945లో డూమ్స్ డే గడియారాన్ని రూపొందించారు. ప్రపంచ మనుగడకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో చెప్పడానికి డూమ్స్ డే గడియారంను రూపొందించారు. దీనికి మొదటి చైర్మన్ గా జె. రాబర్ట్ ఒపెన్ హైమర్ ఉన్నారు. ప్రస్తుతం ఈ గడియారంను 13మంది నోబెల్ బహుమతి విజేతలతో కూడిన శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ గడియారంలో టైం మారుతుంటుంది. ఆ ఏడాదిలో జరిగిన సహజ మార్పులు, మానవాళికి జరిగిన నష్టం ఆధారంగా ఈ వాచ్ లో టైమ్ మారుతుంటుంది. వాస్తవానికి ఈ సంస్థ అసలు ఉద్దేశం అణ ముప్పులను కొలవడం, కానీ, 2007లో బులెటిన్ దాని లెక్కల్లో వాతావరణ సంక్షోభాన్ని కూడా చేర్చాలని నిర్ణయించింది.