లిటరేచర్ లో ఇద్దరికి నోబెల్

 2018, 2019 సంవత్సరాలకు గాను సాహిత్యంలో నోబెల్ పురస్కార విజేతలను ప్రకటించింది స్వీడిష్ అకాడమీ. ఇద్దరు ఐరోపా రచయితలు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. 2018 సంవత్సరానికి సాహిత్యంలో పోలండ్ రచయిత్రి ఓల్గా టోకర్ జుక్ నోబెల్ పురస్కారానికి ఎంపికవగా..2019కి గాను సాహిత్యంలో ఆస్ట్రియన్ రచయిత పీటర్ హ్యాండ్ కే నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.

సాహిత్యం విభాగంలో అవార్డులను ప్రదానం చేసే స్వీడిష్ అకాడమీని స్వీడిష్ ఫొటోగ్రాఫర్ జీన్ క్లౌడే అర్నాల్ట్ నిర్వహిస్తున్నాడు. అర్నాల్ట్ పై డజన్ మందికిపైగా మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో అది కాస్తా మీటూ ఉద్యమానికి దారితీయడంతో.. గతేడాది నోబెల్ బహుమతుల ప్రకటన వాయిదా పడింది. ఇదే కేసులో అర్నాల్ట్ కు రెండేళ్ల జైలు శిక్ష కూడా పడ్డది. ఇప్పుడు 2018తోపాటు 2019 విజేతను కూడా ప్రకటించారు.

పోలిష్ నావలిస్ట్ ఓల్గా టొకర్‌జుక్ మొదటి నవల 1993లో ప్రచురితమైంది. ఆమె తరంలో ఆమె గొప్ప ప్రజాదరణ పొందిన నవలా రచయిత్రి. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి 1980వ దశకం వరకు పోలండ్ చరిత్రను వివరించే ‘ప్రైమ్‌వల్ అండ్ అదర్ టైమ్స్’తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. గత ఏడాది ఆమెకు మాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ లభించింది. క్సీజీ జకుబొవే’ (ది బుక్స్ ఆఫ్ జాకోబ్స్) రచించినందుకు గాను ఓల్గా టొకర్‌జుక్‌ సాహిత్యంలో 2018వ సంవత్సరానికి నోబెల్ బహుమతి అందుకుంటోంది. సమగ్ర భావావేశంతో పరిమితులను అధిగమించే జీవన విధానాన్ని వర్ణించే వివరణాత్మక ఊహా కల్పన ఆమె రచనలో ఉందని స్వీడిష్ అకాడమీ తెలిపింది.

ఆలోచనలు రేకెత్తించే రచనలు చేస్తారనే ఘనత హండ్కే సొంతం. 1975లో ప్రచురితమైన ‘ఏ సారో బియాండ్ డ్రీమ్స్’ గొప్ప ప్రజాదరణ పొందిన ఆయన రచనల్లో ఒకటి. హండ్కే విజేతగా నిలవడానికి కారణం ఆయన అత్యంత ప్రభావశీల రచన చేసినట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది. మానవ అనుభూతుల ప్రత్యేకత, అవధులను భాషాపరమైన చాతుర్యంతో వర్ణించారని తెలిపింది.
 

ట్రెండింగ్ వార్తలు