బిగ్ బ్రేకింగ్ : పేలిన కారు బాంబు..30 మంది మృతి

  • Publish Date - December 28, 2019 / 08:36 AM IST

కారు బాంబు పేలడంతో 30 మంది దాక మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సోమాలియాలో చోటు చేసుకుంది. మొగదిషులో 2019, డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం జరిగింది. బాగా రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని నిందితులు ఎంచుకున్నారు. ఓ తనిఖీ కేంద్రం వద్ద కారును ఉంచారు. అనంతరం కొద్ది సేపటి తర్వాత ఆ కారులో ఉన్న బాంబులు పేలిపోయాయి. అక్కడనే ఉన్న ఎంతో మంది మృతి చెందారు. సూసైడ్ బాంబర్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. 

గాయపడిన వారి సంఖ్య అధికంగా ఉందని అంచనా వేస్తున్నారు. 100 మందిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థులు బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు పోలీసు అధికారి మహ్మద్ హుస్సేన్ తెలిపారు. మృతుల సంఖ్య అధికంగానే ఉంటుందని అయితే..ఈ పేలుడుకు తామే చేశామని ఏ సంస్థ వెల్లడించలేదు. ఇదివరకు అల్ షబాబ్ మిలిటెంట్లు ఈ తరహాలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. 

Read More : Video : ఊహించని గిఫ్ట్.. బోరుమని ఏడ్చేసిన బామ్మ! 

22 మంది మృతదేహాలను లెక్కించినట్లు..ఇది చీకటి రోజుగా ఓ వ్యక్తి అభివర్ణించాడు. ఘటనా ప్రదేశానికి మొగదిషు మేయర్ ఒమర్ మహ్మద్ చేరుకున్నారు. 90 మంది పౌరులు గాయపడినట్లు, ఇందులో ఎక్కువ శాతం విద్యార్థులున్నట్లు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. 
 

Suicide-bomber driving a car laden with explosives detonates at #Mogadishu’s Ex-control Afgoye. Casualties of this horrific blast is yet to clarify. #Somalia. pic.twitter.com/BaHeG44zV2

— Bashiir Maxmud (@BashiirMaxmud) 28 December 2019