china : డ్రాగన్ కంట్రీ కొత్త కుట్ర.. సరిహద్దుల్లో పవర్‌ గ్రిడ్‌ల హ్యాకింగ్ కు యత్నం

భారత్ సరిహద్దులో డ్రాగన్ కంట్రీ తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో తన ప్రాబల్యాన్ని నిరూపించుకొనేందు పడరాని పాట్లు పడుతుంది.

Chinese Hackers Target India's Power Grid

china : భారత్ సరిహద్దులో డ్రాగన్ కంట్రీ తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో తన ప్రాబల్యాన్ని నిరూపించుకొనేందు పడరాని పాట్లు పడుతుంది. ఒకవైపు సైనిక కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే మరోవైపు కొత్త కుట్రలకు తెరలేపుతుంది. ఈ సారి భారతదేశం – చైనా సరిహద్దు ప్రాంతమైన లడఖ్‌ రీజియన్ లో ఉన్న పవర్ గ్రిడ్ లక్ష్యంగా హ్యాకింగ్ కు పాల్పడే ప్రయత్నం చేసినట్లు ప్రైవేట్ ఇంటెలిజెన్స్ కంపెనీ రికార్డెడ్ ప్యూచర్ వెల్లడించింది. లడఖ్ ప్రాంతంలో గ్రిడ్ నియంత్రణకు, విద్యుత్ సరఫరాకు రియల్ టైం కార్యకలాపాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డిస్పాచ్ కేంద్రాలపై హ్యాకర్లు దృష్టిసారించినట్లు రికార్డె ప్యూచర్ తన నివేదికలో తెలిపింది.

China India border Issue: సరిహద్దు వెంట సాయుధ రోబోలను మోహరించిన చైనా

రికార్డెడ్ ఫ్యూచర్ ప్రకారం.. TAG-38గా పిలువబడే హ్యాకింగ్ గ్రూప్ షాడోప్యాడ్ అనే హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినట్లు తెలిపింది. ఇది గతంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీతో కలిసి పనిచేసిందని రికార్డెడ్ ప్యూచర్ పేర్కొంది. పవర్ గ్రిడ్ ఆస్తుల లక్ష్యంతో పాటు జాతీయ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ, బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన భారతీయ అనుబంధ సంస్థను సైతం హ్యాకర్లు టార్గెట్ చేసినట్లు గుర్తించామని వెల్లడించింది.

India-China: భారత్ చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి: గాల్వాన్ సహా ఇతర అంశాలపై చర్చ

చైనా ప్రభుత్వ సహకారంతోనే హ్యాకర్లు ఈ దాడులకు ప్రయత్నించినట్లు స్పష్టమవుతుందని రికార్డెడ్ ప్యూచర్ వెల్లడించింది. రికార్డెడ్ ఫ్యూచర్‌లోని సీనియర్ మేనేజర్ జోనాథన్ కాండ్రా మాట్లాడుతూ.. దాడి చేసేవారు చొరబాట్లు చేయడానికి ఉపయోగించే పద్ధతి, వినియోగించే పరికరాలు అసాధారణమైనవి. చొరబాట్లను ప్రయోగించడానికి ఉపయోగించిన పరికరాలు దక్షిణ కొరియా, తైవాన్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ విషయంపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించలేదు. మరోవైపు ఈ అంశంపై కేంద్రం స్పందించాల్సి ఉంది.