India-China: భారత్ చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి: గాల్వాన్ సహా ఇతర అంశాలపై చర్చ

2020 జూన్ లో గాల్వాన్ ఘర్షణలు మరియు తూర్పు లడఖ్‌లో సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత ఒక ఉన్నత స్థాయి చైనా అధికారి భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి

India-China: భారత్ చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి: గాల్వాన్ సహా ఇతర అంశాలపై చర్చ

China

India-China: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గురువారం భారత్ చేరుకున్నారు. ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన “ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) విదేశాంగ మంత్రుల” సమావేశంలో పాల్గొన్న వాంగ్ యి..నేరుగా భారత్ చేరుకున్నారు. అయితే చైనా విదేశాంగ మంత్రిగా వాంగ్ యి భారత పర్యటన చివరి నిముషంలో ఖరారైంది. దీంతో వాంగ్ యి.. ఢిల్లీలో విమానం దిగిన తరువాతగానీ ఈ పర్యటనను ఇరుదేశాలు ఖరారు చేయలేదు. ఈపర్యటన సందర్భంగా వాంగ్ యి..శుక్రవారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ను కలవనున్నారు. 2020 జూన్ లో గాల్వాన్ ఘర్షణలు మరియు తూర్పు లడఖ్‌లో సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత ఒక ఉన్నత స్థాయి చైనా అధికారి భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి.

Also read:US Aquaculture : మంత్రి కేటీఆర్ అమెరికా టూర్.. పెట్టుబడులకు అమెరికా సంస్థల ఆసక్తి

కాగా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) విదేశాంగ మంత్రుల” సమావేశం నిమిత్తం మొదట పాకిస్తాన్ లో పర్యటించిన వాంగ్ యి..జమ్మూ కాశ్మీర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. “కాశ్మీర్ సమస్యపై, తాము మరోసారి ఇస్లామిక్ స్నేహితుల ఆకాంక్షను విన్నాము. చైనా కూడా అదే ఆకాంక్షను పంచుకుంటుంది” అంటూ వాంగ్ యి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా విదేశాంగ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. జమ్మూ కాశ్మీర్ అంశంపై వ్యాఖ్యానించడానికి చైనాకు ఎటువంటి అధికారం లేదని అది భారతదేశ అంతర్గత వ్యవహారమని భారత్ పేర్కొంది. వాంగ్ యీ వ్యాఖ్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్ధించబోమని భారత్ తీవ్ర స్వరంతో హెచ్చరించింది.

Also Read:The Kashmir Files: అంతగా చూడాల్సిన సినిమా అయితే ఉచితంగా యూట్యూబ్ లో అప్‌లోడ్ చేయండి: అరవింద్ కేజ్రీవాల్

ఇస్లామాబాద్ లో జరిగిన సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారతదేశం గురించి అవగాహన లేకుండా మాట్లాడారని ఆవ్యాఖ్యలను భారత్ ఖండిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన విషయాలు పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారాలని.. చైనా సహా ఇతర దేశాలకు ఈ విషయంపై మాట్లాడే అర్హత లేదని బాగ్చి తెలిపారు. భారతదేశ అంతర్గత సమస్యల గురించి ఇతర దేశాల అవగాహనా రాహిత్యం నుంచి దూరంగా ఉన్నామని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.

Also Read:Sundar Pichai: నిద్ర బదులు “నాన్-స్లీప్-డీప్-రెస్ట్” తీసుకుంటానంటున్న సుందర్ పిచై: అంటే ఏమిటి