The Kashmir Files: అంతగా చూడాల్సిన సినిమా అయితే ఉచితంగా యూట్యూబ్ లో అప్‌లోడ్ చేయండి: అరవింద్ కేజ్రీవాల్

ది కాశ్మీర్ ఫైల్స్" చిత్రం నిజంగా అందరూ చూడాల్సిన చిత్రమే అయితే..దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆ చిత్రాన్ని ఉచితంగా యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసేలా బీజేపీ నేతలు కోరాలని" అన్నారు

The Kashmir Files: అంతగా చూడాల్సిన సినిమా అయితే ఉచితంగా యూట్యూబ్ లో అప్‌లోడ్ చేయండి: అరవింద్ కేజ్రీవాల్

Aravind

The Kashmir Files: ఇటీవల భారత్ లో విడుదలైన హిందీ చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్” దేశ వ్యాప్తంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. కాశ్మీర్ పండిట్లపై ఊచకోత, ఉగ్రవాదుల చర్యలతో ఆ రాష్ట్రం నుంచి వలస వెళ్లిన పండిట్ల వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారత్ లో అంతర్భాగమైన కాశ్మీర్ లో పండిట్లపై జరిగిన దారుణ ఘటనలు హిందూ మతాన్ని అణిచివేసేందుకు ఉగ్రవాదులు చేపట్టిన అమానవీయ చర్యలుగా అభివర్ణిస్తూ, దేశ ప్రజలకు నిజాలు తెలిసేలా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 11న విడుదలైన ఈచిత్రం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విజవంతంగా ప్రదర్శించబడుతుంది. కలెక్షన్స్ లో ఇప్పటికే రూ.200 కోట్ల మెయిలురాయిని దాటిన “ది కాశ్మీర్ ఫైల్స్” చిత్రం..తక్కువ సమయంలో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటుసంపాదించింది.

Also read:Yogi Adityanath: శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్: రేపు ప్రమాణస్వీకారం

ఇక దేశంలోని అన్ని వర్గాలతో పాటు..సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఈ చిత్రంపై ప్రసంశలు కురిపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పన్ను మినహాయింపు కూడా ప్రకటించారు. ప్రధాని మోదీ సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. దేశంలోని ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రమని ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని చూసి నిజానిజాలను తెలుసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. అయితే ఈ చిత్రంపై తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ “ది కాశ్మీర్ ఫైల్స్” చిత్రం నిజంగా అందరూ చూడాల్సిన చిత్రమే అయితే..దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆ చిత్రాన్ని ఉచితంగా యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసేలా బీజేపీ నేతలు కోరాలని” అన్నారు.

Also read:Sundar Pichai: నిద్ర బదులు “నాన్-స్లీప్-డీప్-రెస్ట్” తీసుకుంటానంటున్న సుందర్ పిచై: అంటే ఏమిటి

ఢిల్లీలో ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వారి డిమాండ్ పై స్పందించిన సీఎం కేజ్రీవాల్ పై విధంగా స్పందించారు. ప్రజలు నిజాలు తెలుసుకోవాల్సిన చిత్రాలే అయితే ఇలా టికెట్ ధరలు పెట్టి, పన్ను మినహాయింపులు ఇవ్వడం దేనికని..నిజానిజాలు అందరికి తెలిసేలా అటువంటి చిత్రాలను యూట్యూబ్ లో ఉచితంగా పోస్ట్ చేయాలనీ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, త్రిపుర, గోవా మరియు ఉత్తరాఖండ్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఈ చిత్రంపై వినోద పన్ను మినహాయింపు ఇచ్చారు.