Sundar Pichai: నిద్ర బదులు “నాన్-స్లీప్-డీప్-రెస్ట్” తీసుకుంటానంటున్న సుందర్ పిచై: అంటే ఏమిటి

ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గూగుల్ సీఈఓ సుందర్ పిచై మాట్లాడుతూ..తాను నిద్రకంటే అత్యుత్తమమైన విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు.

Sundar Pichai: నిద్ర బదులు “నాన్-స్లీప్-డీప్-రెస్ట్” తీసుకుంటానంటున్న సుందర్ పిచై: అంటే ఏమిటి

Nsdr

Sundar Pichai: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ “గూగుల్” సీఈఓగా క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు సుందర్ పిచై. నిత్యం బోర్డు మీటింగులు, ప్రొడక్ట్ సర్వీస్ రివ్యూలు, కంపెనీ ఫైనాన్సియల్ వ్యవహారాలు వంటి ఎన్నో పనులను చక్కబెడుతూ..వ్యక్తిగత జీవితాన్ని సైతం సంస్థ అభివృద్ధికి ధారపోస్తున్నారు సుందర్ పిచై. మనసుకు శరీరానికి విశ్రాంతి లేకుండా అలా ఎంత కాలం పనిచేయగలుగుతారు. ఇదే ప్రశ్న ఇటీవల గూగుల్ సీఈఓ కూడా ఎదుర్కొన్నారు. ఇటీవల ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గూగుల్ సీఈఓ సుందర్ పిచై మాట్లాడుతూ..తాను నిద్రకంటే అత్యుత్తమమైన విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు. నాన్-స్లీప్-డీప్-రెస్ట్ (non-sleep deep rest or NSDR)గా పిలిచే ఈతరహా విశ్రాంతితో మనసుకు, శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందని..దీంతో మిగతా పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతున్నానని సుందర్ పిచై చెప్పుకొచ్చారు.

Also read:Amazon Free courses: అమెజాన్ లో500 ఫ్రీ కోర్సులు: జాబ్ కొట్టాలంటే ఇవి నేర్చుకోండి

ఏమిటీ నాన్-స్లీప్-డీప్-రెస్ట్:
పేరును బట్టే తెలుస్తుంది ఈ ఎన్.ఎస్.డి.ఆర్ అంటే ఏమిటో. “నిద్రతో సంబంధం లేకుండా లోతైన విశ్రాంతి తీసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇంతవరకు ఎన్నడూ వినని ఈ పదం గురించి ఇటీవల చాలామంది వ్యాపారవేత్తలు తెగ వెతికేస్తున్నారట. ఈవిధానంలో నిద్రపోవడం కంటే ముఖ్యంగా శరీరానికి, మనసుకు అవసరమైన గరిష్ట విశ్రాంతి ఇస్తుంది. NSDR అనేది “మానసిక దృష్టి ద్వారా స్వీయ-నిర్దేశిత ప్రశాంతత” సాధించడానికి ఒక నిర్దిష్ట టెక్నిక్. విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తు మరింత సులభంగా నిద్రపోవడానికి ఈ పద్ధతి సహాయపడుతుంది. ఇది శారీరక, మానసిక మరియు భావోద్వేగలను తగ్గించి, రిలాక్స్, రెస్ట్ ను క్రమబద్ధంగా ప్రేరేపిస్తుంది. ప్రత్యేకమైన శ్వాస పద్ధతి నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. మనశరీరంలో పారాసింపథెటిక్ (రిలాక్సేషన్, రెస్ట్ & డైజెస్ట్) ప్రతిస్పందనను సక్రియం చేయడానికి ఇదొక చక్కని మార్గంగా చెప్పవచ్చు. ధ్యానం, యోగా కంటే ఈ నాన్-స్లీప్-డీప్-రెస్ట్ (NSDR) పద్ధతి ద్వారా శరీరానికి కావాల్సినంత విశ్రాంతి ఇవ్వగలమని పరిశోధకులు పేర్కొంటున్నారు.

Also read:TTD : తిరుమలలో ఏప్రిల్‌‌‌లో జరిగే విశేష పర్వదిన వివరాలు

ఎలా పాటించాలి:
నాన్-స్లీప్ డీప్ రెస్ట్((NSDR)కి సంబంధించి యూట్యూబ్ లో 10, 20, 30 నిమిషాల నిడివిగల వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ NSDRలో ప్రధానంగా మూడు రకాల పద్దతులు ఉన్నాయి. నాన్-స్లీప్ డీప్ రెస్ట్: యోగా నిద్ర, నాన్-స్లీప్ డీప్ రెస్ట్: సమ్మోహనం మరియు నాన్-స్లీప్ డీప్ రెస్ట్: స్వల్ప నిద్ర అనే మూడు పద్ధతులు అవలంభిస్తారు. ముందుగా కళ్ళు మూసుకొని నేలపై పడుకోవాలి. అనంతరం శ్వాస పై ధ్యాస పెట్టి..మనసును లగ్నం చేయాలి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని మర్చిపోయి ఏదైనా ప్రకృతి సుందర ప్రదేశంపై ఏకాగ్రత సాదించాలి. ఈ ప్రక్రియాల ద్వారా ఆందోళన, ఒత్తిడిని అధిగమించి..మిగతా విషయాలపై ధ్యాస పెట్టేందుకు సహాయపడుతుంది. మీరు NSDR ప్రయత్నించాలనుకుంటే ముందు యూట్యూబ్ లో ఈ అంశం గురించి వెతకండి. ఈ నాన్-స్లీప్ డీప్ రెస్ట్ విధానం వలన చాలా మంచి ఫలితాలు వస్తున్నట్లు ఇప్పటికే ఈ పద్ధతులు పాటిస్తున్నవారు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు.

Also read:Bank Holidays : ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస సెలవులు.. ముందే పనులు పూర్తి చేసుకోండి