అలర్ట్.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో బుధవారం మంచి నీటి సరఫరా బంద్.. ఈ రోజే బిందెలు నింపి పెట్టుకోండి..

బల్క్‌ ఫీడర్ల నిర్వహణతో పాటు పాడైపోయిన విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనుండడంతో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

అలర్ట్.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో బుధవారం మంచి నీటి సరఫరా బంద్.. ఈ రోజే బిందెలు నింపి పెట్టుకోండి..

Updated On : November 25, 2025 / 9:28 AM IST

Krishna Water: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం మంచి నీటి సరఫరా బంద్ కానుంది. విద్యుత్‌ మరమ్మతు పనులు చేస్తుండడంతో కృష్ణా జలాల పంపింగ్‌ను దాదాపు 6 గంటలు నిలిపివేస్తామని వాటర్‌బోర్డు అధికారులు చెప్పారు.

బల్క్‌ ఫీడర్ల నిర్వహణతో పాటు పాడైపోయిన విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనుండడంతో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా ఫేజ్‌ 1, 2, 3 పంపింగ్‌ స్టేషన్లకు విద్యుత్‌ను సరఫరా చేసేవాటిలో ఈ పనులు జరుగుతున్నట్లు వివరించారు. నాగార్జున సాగర్‌ నాసర్లపల్లి పంపింగ్‌ స్టేషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్‌ స్టేషన్లకు రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పవర్ నిలిపివేస్తారు. (Krishna Water)

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ప్రమోషన్ల కోసం కీలక సమావేశం 

విద్యుత్‌ నిలిపివేసే ప్రాంతాలు

  • ఉప్పల్‌
  • హఫీజ్‌పేట్‌
  • రాజేంద్రనగర్‌
  • మణికొండ
  • బోడుప్పల్‌
  • మీర్‌పేట్‌
  • చార్మినార్‌
  • వినయ్‌నగర్‌
  • బోజగుట్ట
  • రెడ్‌హిల్స్‌
  • నారాయణగూడ
  • ఎస్సార్ నగర్‌
  • మారేడ్‌పల్లి
  • రియాసత్‌ నగర్‌
  • కూకట్‌పల్లి
  • సాహెబ్‌నగర్‌
  • హయత్‌నగర్‌
  • సైనిక్‌పురి