ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ప్రమోషన్ల కోసం కీలక సమావేశం
ప్రమోషన్ల ఫైనలైజేషన్, చానలైజేషన్‌పై చర్చిస్తున్నారు.
Secretariat Staff: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లపై జీఓఎం ఇవాళ కీలక సమావేశం జరపనుంది. ఉదయం 11 గంటలకు మంగళగిరి డిప్యూటీ సీఎం కార్యాలయంలో సమావేశమై చర్చించనుంది.
ప్రమోషన్ల ఫైనలైజేషన్, చానలైజేషన్‌పై మంత్రివర్గం చర్చించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (Secretariat Staff)
Also Read: కలవర పెడుతున్న 2 అల్పపీడనాలు.. ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త
కాగా, సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లపై అధ్యయనం చేయాలని సబ్ కమిటీని ప్రభుత్వం గత నెలలోనే ఆదేశించింది. ప్రమోషన్ల తర్వాత ఖాళీల భర్తీ గురించి కూడా చర్చించి నివేదిక ఇవ్వాలని చెప్పింది. ఏపీ ప్రభుత్వం సచివాలయాల ప్రక్షాళన కోసం చర్యలు కొనసాగిస్తోంది.
సచివాలయ ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు 10 మంది మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే ఛాన్స్ ఉంది.
గతంలోనే కొందరు డీఏలను పంచాయతీ కార్యదర్శలుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సారి తీసుకునే నిర్ణయం కోసం ఉద్యోగులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సచివాలయ సిబ్బంది సమస్యలను ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం తెలుసుకుంది.
