Thalaivar173: ఆగిపోయిన సినిమాకు డైరెక్టర్ సెట్.. ఒక సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. రజినీ కోసం కాలేజ్ బ్యాక్డ్రాప్

సూపర్ స్టార్ రజినీకాంత్ తన కెరీర్ లో 173(Thalaivar173)వ సినిమా చేయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించనున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

Thalaivar173: ఆగిపోయిన సినిమాకు డైరెక్టర్ సెట్.. ఒక సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. రజినీ కోసం కాలేజ్ బ్యాక్డ్రాప్

Ramkumar Balakrishnan to direct Rajinikanth 173rd movie sn

Updated On : November 25, 2025 / 11:11 AM IST

Thalaivar173: సూపర్ స్టార్ రజినీకాంత్ తన కెరీర్ లో 173(Thalaivar173)వ సినిమా చేయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించనున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. స్పెషల్ వీడియో కూడా విడుదల చేశారు. సీనియర్ దర్శకుడు సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని కూడా చెప్పుకొచ్చారు. కానీ, రజినీకాంత్ కి కథ నచ్చకపోవడంతో ప్రాజెక్టు వారం తిరగకుండానే క్యాన్సిల్ అయ్యింది. ఇక అప్పటినుంచి ఈ ప్రాజెక్టు కోసం కొత్త దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు మేకర్స్. ఎట్టకేలకు దర్శకుడు దొరికినట్టుగా తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు రామ్ కుమార్ బాలకృష్ణన్.

Ustaad Bhagat Singh: పవన్ సినిమా రీమేక్ కాదు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కన్ఫర్మ్ అంటున్నారు..

ఈ దర్శకుడు గతంలో పార్కింగ్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఒక అపార్ట్మెంట్ లో పార్కింగ్ ప్లేస్ వాళ్ళ వచ్చిన చిన్న సమయం ఎంత పెద్ద గొడవలకు దారి తీసింది అనే కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఓటీటీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఈ దర్శకుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం ఒక కథను సిద్ధం చేశాడట. కాలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉన్న ఈ సబ్జెక్టు కమల్ హాసన్ కి, రజినీకాంత్ కి బాగా నచ్చిందట. వెంటనే షూటింగ్ మొదలుపెట్టాలని సూచించారట.

త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక తన కెరీర్ లో ఇంత తొందరగా రజినీకాంత్ ను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేశాడట దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్. ఇంకా ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు కూడా త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే, రజినీకాంత్ ప్రస్తుతం డైరెక్టర్ నెల్సన్ కుమార్ తో జైలర్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే రామ్ కుమార్ బాలకృష్ణన్ మూవీ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు రజినీకాంత్. మరి ఈ యంగ్ డైరెక్టర్ రజినీకాంత్ ని ఎలా చూపించనున్నాడు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.