Amazon Free courses: అమెజాన్ లో500 ఫ్రీ కోర్సులు: జాబ్ కొట్టాలంటే ఇవి నేర్చుకోండి

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)గా పిలిచే ఈ సర్వీస్ లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో అమెజాన్ ఉంది. ఈ ప్లాట్ ఫార్మ్ పై పనిచేయాలంటే లక్షలాది మంది ఉద్యోగుల అవసరం ఉంటుంది.

Amazon Free courses: అమెజాన్ లో500 ఫ్రీ కోర్సులు: జాబ్ కొట్టాలంటే ఇవి నేర్చుకోండి

Aws

Amazon Free courses: మీరు టెక్నికల్ కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారా? డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులు నేర్చుకుంటే జాబ్ పక్కా కొట్టొచ్చన్న సంగతి మీకు తెలుసా. ఎటువంటి టెక్నికల్ నాలెడ్జి లేకుండానే కాస్త కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఆయా కోర్సులు చాలా సులభంగా నేర్చుకోవచ్చు. అలా ఏదైనా కోర్స్ నేర్చుకుని జాబ్ కొట్టాలనుకునేవారికి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ బంపర్ ఆఫర్ ఇస్తుంది. అమెజాన్ సంస్థలో ఈ కామర్స్ తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)గా పిలిచే ఈ సర్వీస్ లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో అమెజాన్ ఉంది. అయితే ఈ ప్లాట్ ఫార్మ్ పై పనిచేయాలంటే లక్షలాది మంది ఉద్యోగుల అవసరం ఉంటుంది. అయితే కొందరిలో కావాల్సిన కంప్యూటర్ నైపుణ్యం లేకపోవడంతో ఆయా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇది గమనించిన అమెజాన్ సంస్థ AWS ప్లాట్ ఫార్మ్ పై సుమారు 500 కోర్సులను ఉచితంగా అందిస్తుంది.

Also Read:No Phones In Classroom : ‘క్లాస్‌ రూమ్స్‌లో ఫోన్లు వాడితే కఠిన చర్యలు’ టీచర్లకు జిల్లా మేజిస్ట‍్రేట్‌ వార్నింగ్

అంతర్జాతీయంగాసుమారు 3 మందికి ఈ డిజిటల్‌ ట్రెయినింగ్‌ కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు ఇన్స్టిట్యూట్ లు, లాభాపేక్ష లేని విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, ట్రైనింగ్ కంపెనీలు మొదలైన వాటితో కలిసి పనిచేస్తుంది. మన ఇండియాలో ఆరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లతో కలిసి ఈ ఉచిత కోర్సులు అందిస్తుంది అమెజాన్. ఏడబ్ల్యూఎస్‌ రీ/స్టార్ట్‌ పేరిట 12 వారాల పూర్తి స్థాయి కోర్సును ఉచితంగా అందిస్తోంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో జాబ్ కొట్టాలనుకునే వారు “aws restart” అనే పేరుతో ఇంటర్నెట్ లో వెతికితే పూర్తి వివరాలు తెలుస్తాయి. భారత్ లో 2017 నుండి దాదాపు పది లక్షల మందికి శిక్షణనిచ్చినట్లు అమెజాన్ తెలిపింది.

Also read:Best Smartwatches : భారత్‌లో రూ. 15వేల లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే..!