Yogi Adityanath: శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్: రేపు ప్రమాణస్వీకారం

అమిత్ షా ఆధ్వర్యంలో గురువారం యూపీ బీజేపీ శాసనసభ్యులు సమావేశం అయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

Yogi Adityanath: శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్: రేపు ప్రమాణస్వీకారం

Yogi

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ సహా బీజేపీ జాతీయ స్థాయి నేతలు ఇతర పార్టీ ప్రముఖులు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గత ముప్పై ఏళ్లలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తూ యోగి ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించారు. ఈక్రమంలో అమిత్ షా ఆధ్వర్యంలో గురువారం యూపీ బీజేపీ శాసనసభ్యులు సమావేశం అయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. యూపీ గవర్నర్ ను కలిసిన అనంతరం సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Also read:Sundar Pichai: నిద్ర బదులు “నాన్-స్లీప్-డీప్-రెస్ట్” తీసుకుంటానంటున్న సుందర్ పిచై: అంటే ఏమిటి

గురువారం లక్నోలో జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా కూడా పాల్గొన్నారు. శాసనసభా పక్ష నేతగా యోగి ఆదిత్యనాథ్ ఎన్నికైన అనంతరం బీజేపీ నేతలు కరతాళ ధ్వనులు చేశారు. “భారత్ మాతా కీ జై” “వందేమాతరం” అంటూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ “గత ఐదేళ్లలో మేము చేసిన కృషి వల్లనే మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చింది. ప్రజాకోర్టులో మా సత్తా నిరూపించుకున్నాం” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. “ఎన్నికల వేళా విపక్షాలు విషప్రచారం చేసినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయోగించిన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ మంత్రం ప్రభావం చూపింది. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు పండుగలు ప్రశాంతంగా జరుపుకోవచ్చు” అంటూ యోగి వ్యాఖ్యానించారు.

Also read:AP Capital : రాజధానిపై తగ్గేదే లేదన్న సీఎం జగన్.. వికేంద్రీకరణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

ఇక అమిత్ షా మాట్లాడుతూ..పూర్తి పారదర్శకంగా శాసనసభా పక్ష నేతగా యోగి ఆదిత్యనాథ్ ను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలో(కాంగ్రెస్ నుద్దేశించి) సంస్థాగత మార్పులు అవసరం అంటూ ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ అధిష్టానానికి సూచనలు చేస్తూంటే..మా పార్టీలో మాత్రం కలిసికట్టుగా ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుంటున్నామని అమిత్ షా అన్నారు. “మన పార్టీ నుంచి శాసనసభా నేతగా పేరును ప్రతిపాదించాలంటూ నేను అడిగిన ప్రశ్నకు.. షాజహాన్‌పూర్ ఎమ్మెల్యే సురేష్ ఖన్నా.. యోగి ఆదిత్యనాథ్ పేరును ప్రతిపాదించారు. అనంతరం సభ్యులందరు ఏకగ్రీవ ప్రకటన తెలిపారు.” అంటూ అమిత్ షా వెల్లడించారు.

Also read:Paddy Issue : టీఆర్ఎస్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం.. అన్నీ తప్పుడు ఆరోపణలే – పీయూష్ గోయల్