Iraq : బాంబులతో దద్దరిల్లిన ఇరాక్.. విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి
ఇరాక్ లో మరోసారి బాంబుల మోత మోగింది. ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది.
- kunduru Vinod
- Published On : September 12, 2021 / 10:12 AM IST
Iraq
Iraq : ఇరాక్ లో మరోసారి బాంబుల మోత మోగింది. ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రెండు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి జరిగిన ప్రాంతంలో ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Read More : Delhi : కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లకు కేంద్రం పిలుపు
అయితే ఈ దాడికి పాల్పడిన వారు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ విమానాశ్రయం సమీపంలో అమెరికన్ కాన్సులేట్ కూడా ఉంది. పేలుళ్ల అనంతరం దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు విమానాశ్రయ గేట్లను మూసివేశాయి.
Read More : McDonald India మెనూలో కొత్త ఐటమ్స్.. పసుపు పాలు, మసాలా కడక్ చాయ్!
శనివారం రాత్రి ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలో రెండు సార్లు భారీ శబ్ధాలు వినిపించాయని, చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం నల్లని పొగలు కమ్ముకున్నాయని స్థానికులు వెల్లడించారు. కాగా, విమానాశ్రయం కేంద్రంగా జిహాద్ వ్యతిరేక దళాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో ఇరాక్‌లో విమానాశ్రయాలపై దాడులు సర్వసాధారణమయ్యాయి.
