Delhi : కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లకు కేంద్రం పిలుపు

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన..గెజిట్ నోటిఫికేషన్..పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై చర్చించేందుకు కేంద్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

Delhi : కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లకు కేంద్రం పిలుపు

Ap And Telangana

Krishna And Godavari : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన..గెజిట్ నోటిఫికేషన్..పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై చర్చించేందుకు కేంద్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. 2021, సెప్టెంబర్ 13వ తేదీ…ఢిల్లీలో ఈ సమావేశం జరుగనుంది. నేరుగా హాజరు కావాలని…కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ లను కోరింది. ఇప్పటికే సెప్టెంబర్ ఒకటో తేదీన…కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

Read More : Cinema Folk Songs: వెండితెరపై మోత మోగిస్తున్న జానపదం!

నోటిఫికేషన్ అమలు తేదీని వాయిదా వేయాలని, రెండు షెడ్యూల్ లోని ప్రాజెక్టుల విషయంలో మార్పు చేయాలని రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న అత్యవసర సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కృష్ణా, గోదావరి పరిధులను ఖరారు చేస్తూ…జులై 15వ తేదీన కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 14వ తేదీన నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతి పొందాలని, లేకుంటే..నిలిపివేయాలని కూడా తెలిపింది.

Read More : Big Boss 5: బయటపడిన కాజల్‌ బండారం.. సరయు బూతులకు గ్రీన్ సిగ్నల్

గెజిట్ లో పేర్కొన్న గడవుల ప్రకారం…చేయడం సాధ్యం కాదని..దశలవారీగా అయితే..ఇబ్బంది ఉండదని రెండు తెలుగు రాష్ట్రాలు వివరించాయి. రెండు నెలల్లోగా ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ. 200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయడం సాధ్యం కాదని, 15 రోజులకొకసారి…అవసరం ఎంతో చెబితే…దానికి తగ్గట్టు విడుదల చేస్తామని కూడా వివరించాయి. ఈ క్రమంలో..ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్..ఈనెల 06వ తేదీన కేంద్ర జల్ శక్తి…మంత్రిని కలిసి పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం బోర్డు ఛైర్మన్లతో సమావేశం కావాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.