డ్రోన్.. ది గేమ్ ఛేంజర్..! యుద్ధమైనా, సాయమైనా, వ్యవసాయమైనా డ్రోన్లదే కీరోల్..!

వరదలు, విపత్తులు, వ్యవసాయంలోనే కాదు యుద్ధంలోనూ విధ్వంసానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి డ్రోన్లు.

Drone The Game Changer : అగ్రికల్చర్ టు వార్.. హెల్పింగ్ టు స్మగ్లింగ్.. యుద్ధమైనా సాయమైనా ప్రతీ రంగంలో ఫ్లైయింగ్ ఫోర్స్ గేమ్ ఛేంజర్ గా మారుతోంది. ఆపద కాలంలో మనిషికి అండ, అక్రమార్కుల పాలిట సింహ స్వప్నం, అన్నదాతలకు అండ దండ. సిచ్యుయేషన్ ఏదైనా సరే.. దాని పని ఒక్కటే.. గాలిలో వచ్చి వరంగా మారి ఆపదలో అండగా నిలవడమే. 100 మందితో సాధ్యం కానిది, సింగిల్ గా వచ్చేసి చకచకా పనులు చెక్కబెట్టేస్తోంది డ్రోన్.

వివాహ వేడుకలో వీడియోలు తీయడానికైనా, నిందితులను పట్టుకునేందుకైనా, యుద్ధాల్లో దాడులు చేసుకోవడానికైనా డ్రోన్ల అవసరం ఇప్పుడు ఎక్కువైపోయింది. మంచికి, చెడుకు అన్నింటికి డ్రోన్ యూసేజ్ పెరిగిపోతోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్లు యుద్ధతంత్రాన్నే మార్చేస్తున్నాయి. ఆపద్బాంధవిగా, మనిషికి తోడుగా, చేదోడుగా ఉంటోంది డ్రోన్. ఫ్యూచర్ లో ఎమర్జెన్సీ సేవలకు డ్రోన్లే దిక్కా? మన దేశంలో వాడుతున్న డ్రోన్లను ఇంకా అప్ డేట్ చేయాల్సిన అవసరం ఉందా?

ఫ్లయింగ్ ఫోర్స్.. వార్ ఫీల్డ్ లో గేమ్ ఛేంజర్ గా మారుతోంది. డ్రోన్లు యుద్ధతంత్రాన్నే మార్చేస్తున్నాయి. ఒకప్పుడు యుద్ధం అంటే ఆయుధాలు, వార్ ట్యాంకులు అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ, సీన్ అంతా మారిపోయింది. పరిస్థితులు కూడా డిమాండ్ ను క్రియేట్ చేస్తున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్స్ ఎవరి దగ్గర ఉంటే.. వారిదే పైచేయి అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి.

డ్రోన్ అటాక్స్ తో విధ్వంసం సృష్టిస్తున్నాయి దేశాలు. ప్రిడేటర్ డ్రోన్స్, రాడార్ డ్రోన్స్, సూసైడ్ డ్రోన్స్.. ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అప్పర్ హ్యాండ్స్ సాధిస్తున్నారు. యుద్ధతంత్రాన్నే మార్చేసిన డ్రోన్స్ ఇంకా అప్ గ్రేడ్ అయితే..పరిస్థితి ఏంటి? యుద్ధ భూమిలో డ్రోన్లదే కీ రోల్ కాబోతోందా? ఇక రాబోయేదంతా డ్రోన్ వారేనా?

వరదలు, విపత్తులు, వ్యవసాయంలోనే కాదు యుద్ధంలోనూ విధ్వంసానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి డ్రోన్లు. ఈ దేశం ఆ దేశం అని కాదు.. అందరూ డ్రోన్ టెక్నాలజీ మీదే ఫోకస్ పెట్టారు. దీంతో ఈ మధ్య యుద్ధాలు జరుగుతున్న దేశాల మధ్య డ్రోన్లతోనే అటాక్స్ జరుగుతున్నాయి. రష్యా యుక్రెయిన్ వార్ అయినా, మిడిల్ ఈస్ట్ లో దాడులైనా డ్రోన్ మీదే డిపెండ్ అవుతున్నాయి కంట్రీస్. వార్ డ్రోన్స్ ఎంత సమర్థవంతంగా పని చేస్తున్నాయో దీన్ని బట్టే అర్థం అవుతోంది.

యుద్ధం చేయాలంటే తుపాకీ పట్టాల్సిన పని లేదు. సైనికుడే ఫీల్డ్ లోకి దిగాల్సిన అవసరం కూడా లేదు. యుక్రెయిన్ డ్రోన్లను వాడి రష్యన్ ప్రాంతాల్లో కరిగిన థర్మైట్ ను స్ప్రే చేసింది. యుక్రెయిన్ డ్రోన్లు రష్యాలో మండే పదార్ధాలను స్ప్రే చేస్తున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. అంతేకాదు రెండు దేశాలు కూడా పోటాపోటీగా శత్రు స్థావరాలను గుర్తించేందుకు డ్రోన్లను వాడాయి.

Also Read : 2025లో యుగాంతమేనా? భయపెడుతున్న వంగా బాబా, నోస్ట్రడామస్ జోతిష్యం..! నిజమెంత?