×
Ad

US Airstrike : సముద్రంలో డ్రగ్స్‌తో దూసుకెళ్తున్న సబ్‌మెరైన్‌ను పేల్చేసిన అమెరికా.. వీడియో వైరల్.. ట్రంప్ ఏమన్నారంటై..?

US Airstrike కరేబియన్ సముద్రంలో ఓ జలాంతర్గామిని అమెరికా ముంచేసిందని ట్రంప్ తెలిపారు. డ్రగ్స్ తరలిస్తున్న ఓ భారీ జలంతర్గామిని ధ్వంసం చేయడం ..

US airstrike

US Airstrike : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోకి డ్రగ్స్ రవాణాను కట్టడిచేసేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో లాటిన్ అమెరికా దేశాలు సముద్ర మార్గంలో డ్రగ్స్‌ను తమ వైపు రానీయకుండా అమెరికా భారీగా సైనిక బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. దీంతో గత నెలలో అక్రమంగా డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరు పడవలపై యూఎస్ బలగాలు దాడులు చేయడంతో.. అవి సముద్రంలో మునిగిపోయాయి. గురువారం కరేబియన్ సముద్రంలో ఓ భారీ జలాంతర్గామిపై అమెరికా బలగాలు దాడులు చేసి పేల్చేశాయి. ఈ విషయంపై తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

కరేబియన్ సముద్రంలో ఓ జలాంతర్గామిని అమెరికా ముంచేసిందని ట్రంప్ తెలిపారు. డ్రగ్స్ తరలిస్తున్న ఓ భారీ జలంతర్గామిని ధ్వంసం చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. అది అక్రమ మార్గంలో అమెరికా వైపు వస్తుండగా దాడి జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు ఈ దాడిలో మరణించారు. మరో ఇద్దరు స్మగ్లర్లను వారి దేశాలైన కొలంబియా, ఈక్వెడార్ కు పంపించాం. అక్కడ వారిపై విచారణ జరుగుతుందని ట్రంప్ తెలిపారు. అయితే, ఈ విషయాన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తానో పెట్రో కూడా ధ్రుకవీరించారు.

జలాంతర్గామిని పేల్చిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. ‘‘నేను ఈ జలాంతర్గామిని ఒడ్డుకు రానిస్తే కనీసం 25వేల మంది అమెరికన్లు చనిపోతారు. బతికి ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను నిర్బంధం, విచారణ కోసం వారి స్వదేశాలైన ఈక్వెడార్, కొలంబియాకు పంపించాం. ఈ దాడిలో ఏ యూఎస్ దళాలకు హాని జరగలేదు. నా పర్యవేక్షణలో, భూమి ద్వారా లేదా సముద్రం ద్వారా చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలను రవాణా చేసే నార్కో టెర్రరిస్టులను అమెరికా సహించదు ’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.


వెనిజులాలో రహస్య కార్యకలాపాలను నిర్వహించడానికి సీఐఏకి డొనాల్డ్ ట్రంప్ అధికారం ఇచ్చారని సమాచారం. దీంతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవటానికి అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని తెలుస్తోంది. అయితే, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో తనకు ఎలాంటి సంబంధం లేదని మదురో ఖండించారు. అమెరికా దాడులను వెనిజులాలో పాలన మార్పులకు ఒక సాకు అని, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. లాటిన్‌ అమెరికా డ్రగ్స్‌ ముఠాలు అక్రమ రవాణాకు జలాంతర్గాములను వాడటం ఇదే తొలిసారి కాదు. 1990ల నుంచి అక్కడి స్మగ్లర్లు అమెరికా భద్రతా దళాల గస్తీలను తప్పించుకోవడానికి వీటిని వాడుతున్నాయి.