Dubai Man Travels To US To Satisfy Pregnant Wife's Food Cravings
Viral Video : భార్యలను ప్రేమించే భర్తలు ఎందరో. అయితే.. ఆమె గర్భవతి అయితే ఇంక చెప్పేది ఏముంది. కాళ్లు కిందపెట్టకుండా అడినవన్నీ చేసేవాళ్లు ఉంటారు. అయితే.. ఇప్పుడు చెప్పబోయే ఓ వ్యక్తి గురించి తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. గర్భవతి అయిన తన భార్యకు నచ్చిన ఆహారం తినిపించేందుకు ఏకంగా 800 మైళ్లు (సుమారు 13వేల కి.మీ) ప్రయాణం చేశారు. దుబాయ్ నుంచి అమెరికాలోని లాస్ వెగాస్‌కు తీసుకువెళ్లాడు.
24 ఏళ్ల లిండా ఆండ్రేడ్ తొమ్మిది నెలల గర్భవతి. ఆమె తన భర్త రికీతో కలిసి దుబాయ్‌లో నివసిస్తోంది. రికీ ఓ మిలియనీర్. ఆమెకు ప్రసవ సమయం దగ్గరపడుతోంది. అయితే ఆమెకు జపనీస్ వాగ్యు అనే ఆహారాన్ని తినాలని అనిపించింది. అదే విషయాన్ని తన భర్తకు చెప్పింది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో మాత్రమే దీన్ని బాగా వండుతారని, అక్కడి నుంచే దాన్ని తీసుకురావాలని కోరింది.
ఇక చెప్పేది ఏముంది.. వారిద్దరు కలిసి దుబాయ్ నుంచి వెగాస్‌కు వెళ్లారు. నచ్చిన ఆహారాన్ని తినడంతో పాటు నగలను కొనిచ్చాడు. ఈ విషయాన్ని మొత్తాన్ని వివరిస్తూ ఆమె టిక్‌టాక్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో జపనీస్ వాగ్యు తింటూ కనిపించారు. ఈ వంటకం ధర 250 డాలర్లు అని చెప్పింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.21 వేలు అన్నమాట. దీన్ని విన్న అందరూ ఆశ్చర్యపోతున్నారు. నీలాంటి భర్త అందరికి దొరకొద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Lillian Droniak : ప్రేమలో మోసపోయిన 93 ఏళ్ల బామ్మ.. 2023లో ఎంత మందితో డేటింగ్ చేసిందో తెలుసా..?
దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కాగా.. లింగా గత ఏడాది ఓ వారంలో 3 మిలియన్ల డార్లు (దాదాపు రూ.25 కోట్లు) ఖర్చు చేసినట్లు తెలిపింది.