Earthquake : టిబెట్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదు

తెల్లవారుజామున భూమి కంపించడంతో నిద్రలో ఉన్న వారు ఉలిక్కి పడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

Earthquake In Tibet

Earthquake In Tibet : టిబెట్ లోని జిజాంగ్ ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటలకు జిజాంగ్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.

తెల్లవారుజామున భూమి కంపించడంతో నిద్రలో ఉన్న వారు ఉలిక్కి పడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. మరోవైపు మొరాకోలో భూకంపం విలయం సృష్టించింది. 6.8 తీవ్రతో సంభవించిన భారీ భూకంపం ధాటికి 2 వేలకు పైగా మరణించారు. మరో 2 వేల 59 మందికి గాయాలు అయ్యాయి.

Earthquake : జపాన్,కాలిఫోర్నియా, అండమాన్ నికోబార్ దీవులు భూకంపం

పెద్ద సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద తొలగింపు ఆలస్యమవుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా, గత ఆరు దశాబ్ధాల్లో ఇది అతి పెద్ద విపత్తు అని తెలిపారు.