Earthquake
Philippine : ఫిలిప్పీన్స్, అఫ్ఘానిస్థాన్ దేశాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ దేశంలోని మనీలా నగరంలో శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దక్షిణ మనీలా నగరంలో శుక్రవారం ఉదయం 8.24 గంటలకు సంభవించిన భూకంపంతో పలు భవనాలు దెబ్బతిన్నాయి. 100 కిలోమీటర్ల దూరం సంభవించిన భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియలేదు.
Also Read :X removes : ఎక్స్ సంచలన నిర్ణయం…వందలాది హమాస్ ఉగ్రవాదుల ఖాతాల తొలగింపు
మరో వైపు అప్ఘానిస్థాన్ దేశంలో శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. అఫ్ఘానిస్థాన్ దేశంలో వరుసగా గత 15 రోజుల్లో మూడోసారి భూకంపం వచ్చింది. గతంలో వచ్చిన భూకంపం వల్ల 4వేల మంది మరణించగా, పలు భవనాలు నేలకూలాయి. శుక్రవారం ఉదయం 6.39 గంటలకు 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.