Afghanistan Earthquake : అఫ్గానిస్థాన్ లో మరోసారి భూకంపం.. భయంతో వణికిపోయిన స్థానికులు

అఫ్గానిస్థాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. హెరాత్ లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.

Afghanistan Earthquake

Afghanistan: అఫ్గానిస్థాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. హెరాత్ లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. గత వారంకూడా హెరాత్ ప్రావిన్స్ లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. 2,500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం సభవించిన భూకంపం హెరాత్ నగరానికి సమీపంలో 6.3 తీవ్రతతో సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్జీఎస్)తెలిపింది. యుఎస్జీఎస్ నివేదికలో తాజా భూకంప కేంద్రం ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఆఫ్గానిస్థాన్ మూడవ అతిపెద్ద నగరమైన హెరాత్ కు వాయువ్యంగా 30 కిలో మీటర్ల దూరంలో ఉందని తెలిపింది.

ఆప్ఘానికస్థాన్ లో మళ్లీ మళ్లీ భూకంపాలు ఎందుకు రావడానికి ప్రధానంగా హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతం. ఇక్కడ ఆప్ఘానిస్థాన్ తరచుగా భూకంపాల భారిన పడుతోంది. ఈ ప్రాంతం యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ దగ్గర ఉంది. గతంలో సంభవించిన భూకంపాలలో మరణించిన వారిలో 90శాతానికిపైగా మహిళలు, పిల్లలేనని యునిసెఫ్ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు