Egyptian Engineering Student Turns Air Into Water
Egyptian engineering student turns air into water with Elu Robot: ఎడారిలో ఎండమావులు కనిపిస్తాయి గానీ చుక్క నీరు కనిపించదు. ఎడారిలోనే నీరే కనిపించదంటే ఏకంగా మంచినీరు తయారు చేస్తానంటున్నాడు ఓ యువ ఇంజనీరు. ఇటువంటి ఓ అద్భుతాన్ని చేసి చూపించాడు పిరమిడ్ల దేశం అయిన ఈజిప్టుకు చెందిన 28 ఏళ్ల యువ ఇంజనీరు.దాని కోసం ఓ రోబోని కూడా తయారు చేశాడు.ఎడారి నుంచి మంచినీరు తయారు చేసి చక్కగా తాగి మరీ చూపించాడు.
ఎడారిలో మంచినీరు ఎలా తయారుచేస్తారని ఆశ్చర్యపోతాం. కానీ ఇది నిజమంటున్నాడు మహమూద్ ఎల్ కోమి అనే ఈజిప్టు ఇంజనీరు. ఏఐ (కృత్రిమ మేధస్సు)టెక్నాలజీతో అద్భుతాలు చేయవచ్చంటూ మరోసారి నిరూపించాడు మహమూద్ ఎల్ కోమి. అతను తయారు చేసిన రోబోట్ ఓ చక్కటి పేరు కూడా పెట్టాడు ‘ఇలూ’ అని. ఈ రోబో ఎడారిలో వీచే గాలి నుంచి నీటిని తయారు చేస్తుందని తెలిపాడు. కృత్రిమ మేధస్సు సహాయంతో గాలిలో ఉన్న తేమను నీటిగా మారుస్తుంది. దీంతో ఇక అంగారక గ్రహంపైకి వెళ్లే వ్యోమగాములకు నీటి కొరత ఉండదంటూ చెబుతున్నాడు. ఈ రోబో గాలిలోని తేమను గ్రహించి మంచినీటిని తయారు చేస్తుందని తెలిపాడు.ఇది కేవలం భూమ్మీదే కాదు అంగారకుడిపై కూడా నీటిని తయారు చేయగలదని ఇంజనీర్ కోమి.
తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు..
ఇలూ రోబో కృత్రిమ మేధస్సు సహాయంతో పనిచేస్తుంది. రిమోట్‌తో దీనిని ఆపరేట్ చేసేలా తయారు చేశాడు. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని తయారు చేయగల సాంకేతికతతో తయారు చేశామపి మహమ్మూద్ తెలిపాడు. ప్రతీరోజూ 5,000 లీటర్ల నీటిని అందించగలదనీ..ఇటువంటి రోబోలను ఇంకా తయారు చేస్తానని తెలిపాడు.
ప్రస్తుతం గాలి నుంచి నీటిని తయారు చేయడానికి మెకానికల్ హీట్ ఎక్స్ఛేంజర్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ అది చాలా ఖరీదైనదే కాదు చాలా పవర్ కావాల్సి వస్తుంది. కానీ ఇలూ రోబో అలాకాదు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు తయారు చేస్తుంది. మెకానికల్ హీట్ ఎక్స్ఛేంజర్‌లకు ప్రత్యామ్నాయంగా ఈ ఇలూ రోబోట్ ఉపయోగపడుతుందని తెలిపాడు.
కేవలం 9 నెలల్లో రోబో ఇలూ తయారీ…
ఇలూ రోబో తయారీకి కేవలం 9 నెలలు మాత్రమే పట్టిందని కోమి చెప్పాడు. నీటి కరువుతో తల్లడిల్లే ప్రాంతాలు…అస్సలు నీరు అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ఇలూ రోబో పెద్ద ఎత్తున నీటిని తయారు చేస్తోందనీ..ఈ ఇలూతో ఇక నుంచి నీటి కరవు ఉండనే ఉండదని ఇంజనీర్ కోమి తెలిపాడు.ఈ రోబోను తయారీకి రూ. 18 వేలు ఖర్చు అయ్యాయని..ఇలూ నుంచి ఒక లీటరు నీటిని తయారు చేయటానికి కేవలం 7 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపాడు. అదే మెకానికల్ హీట్ ఎక్స్ఛేంజర్‌ల తో అయితే 75 పైసలు ఖర్చు అవ్వనుంది.