Eiffel Tower Bomb Threat
Eiffel Tower: ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన ఈఫిల్ టవర్ (Eiffel Tower) కు బాంబు బెదిరింపు (Bomb threat) వచ్చింది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఈ బెదిరింపు వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అప్పటికే ఈఫిల్ టవర్ సందర్శనలో పర్యాటకులు భారీ సంఖ్యలో ఉన్నారు. దీంతో అధికారులు వారందరిని అప్రమత్తం చేశారు. వెంటనే వారిని ఈఫిల్ టవర్ నుంచి పంపించి వేశారు. ఈలోపు బాంబు నిర్వీర్య నిపుణులతో పాటు పోలీసులు అన్ని అంతస్తుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన పర్యాటకులను కూడా పోలీసులు విచారించారు. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బాంబు బెదిరింపు వచ్చిన వెంటనే అందరూ అప్రమత్తమయ్యారని ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు.
ఈఫీల్ టవర్ చుట్టూ అధికారులు భద్రతను పెంచారు. ముందు జాగ్రత్తగా శనివారం ఈఫిల్ టవర్‌కు పర్యాటకులు ఎవరూ రాకుండా నిలిపివేశారు. సందర్శనకు వచ్చిన పర్యాటకులను తిరిగి పంపించివేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసు అధికారులు మాట్లాడుతూ.. మధ్యాహ్నం సమయంలో ఈఫిల్ టవర్ ను బాంబులతో పేల్చేస్తున్నామని బెదిరింపు వచ్చింది. అయితే, ఎలాంటి బాంబు దొరకలేదు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు అనే విషయంపై విచారణ సాగుతోంది.
బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న ప్రయాణికులు ఈఫిల్ టవర్ మూడు అంతస్తులు, దాని క్రిందఉన్న చతురస్రం నుండి వెంటనే కిందికి దిగిపోయారు. వారిని ఈఫిల్ టవర్ కు దూరంగా అధికారులు పంపించివేశారు. ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ ను చూసేందుకు గత ఏడాది 62లక్షల మంది పర్యాటకులు వచ్చారు. నిత్యం ఆ ప్రాంతంలో పర్యాటకుల రద్దీ ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి అనేక మంది ఈఫిల్ టవర్ చూసేందుకు వస్తుంటారు. బాంబు బెదిరింపు తరువాత ఈఫిల్ టవర్ ప్రాంతంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
PARIS
Eiffel Tower evacuated due to BOMB threat pic.twitter.com/gioNTqGEzd
— Catholic Arena (@CatholicArena) August 12, 2023