Elon Musk poll on Donald Trump over trump twitter account bring back
Musk Poll On Trump: ‘అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలా?’ అంటూ ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ పెట్టిన పోల్‌పై నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందించారు. మస్క్ ట్వీట్ చేసిన ఒక గంటలోనే ఏకంగా 10 లక్షల మంది స్పందించడం గమనార్హం. ఈ విషయమై మస్క్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ట్రంప్ పోల్ గంటలోనే వన్ మిలియన్ చేరుకుంది’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.
తొమ్మిది గంటల క్రితం మస్క్ ఈ ట్వీట్ చేయగా.. ఇప్పటికే 90 లక్షల ఓట్లు వచ్చాయి. ఇంకా ఒస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికి వచ్చిన ఓట్లను చూసుకుంటే 52 శాతానికి పైగా ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించాలని ఓటు వేయగా, 47 శాతానికి పైగా వ్యతిరేకంగా ఓటేశారు. ఈ పోల్ 24 గంటల పాటు జరుగుతుంది. ఈ పోల్ నిర్వహించే ముందు ఎలాన్ మస్క్ మరో ట్వీట్ చేశారు. ‘‘ప్రజల గళమే దేవుడి గళం’’ అని పేర్కొన్నారు. ఇటీవలే ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత గత ఏడాది జనవరి 6న కాపిటల్ భవనంపై దాడి జరగడంతో ఆ తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ట్రంప్ తన మద్దతుదారులను రెచ్చగొట్టేలా ట్వీట్లు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది మేలో ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ ఖాతా పునరుద్ధరణపై ఎలాన్ మస్క్ స్పందించారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తానని అప్పుడే తేల్చి చెప్పారు. అయితే, ట్విట్టర్ ఖాతాను మళ్ళీ వాడడానికి ట్రంప్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
Farooq Abdullah: ఏ మతమూ చెడుది కాదు, మనుషులే అవినీతి పరులు.. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం