Farooq Abdullah: ఏ మతమూ చెడుది కాదు, మనుషులే అవినీతి పరులు.. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం

కొంత మంది హిందువులు ప్రమాదంలో ఉన్నారని అంటున్నారు. ఆ మాటలు కేవలం ఎన్నికలు జరిగినప్పుడే వినిపిస్తున్నాయి. హిందువుల్ని రెచ్చగొట్టడానికి వేరే మతాల్ని చెడుగా చూపిస్తున్నారు. నిజానికి ఏ మతమూ చెడుది కాదు. మనుషులు అవినీతి పరులు, మనుషులు తప్పులు చేస్తారు. వారి అవసరాల కోసం మతాల్ని చెడుగా చూపిస్తున్నారు. దయచేసి ఇలాంటి వాటికి ప్రజలు లోను కాకూడదని నేను విజ్ణప్తి చేస్తున్నాను

Farooq Abdullah: ఏ మతమూ చెడుది కాదు, మనుషులే అవినీతి పరులు.. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం

Farooq Abdullah: ప్రపంచంలోని ఏ మతమూ చెడుది కాదని, మనుషులు అవినీతి చేస్తూ, వారి అవసరాలకు మతాన్ని చెడుగా చూపిస్తున్నారని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా అన్నారు. శనివారం రాష్ట్రంలోని అఖ్నూర్‭లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘కొంత మంది హిందువులు ప్రమాదంలో ఉన్నారని అంటున్నారు. ఆ మాటలు కేవలం ఎన్నికలు జరిగినప్పుడే వినిపిస్తున్నాయి. హిందువుల్ని రెచ్చగొట్టడానికి వేరే మతాల్ని చెడుగా చూపిస్తున్నారు. నిజానికి ఏ మతమూ చెడుది కాదు. మనుషులు అవినీతి పరులు, మనుషులు తప్పులు చేస్తారు. వారి అవసరాల కోసం మతాల్ని చెడుగా చూపిస్తున్నారు. దయచేసి ఇలాంటి వాటికి ప్రజలు లోను కాకూడదని నేను విజ్ణప్తి చేస్తున్నాను’’ అని అన్నారు.

ఇక జమ్మూ కశ్మీర్, పాకిస్తాన్ అంశాల గురించి ఆయన స్పందిస్తూ ‘‘మేము ఎప్పటికీ పాకిస్తాన్‭లో చేరము. జిన్నా మా నాన్నను కలిశాడు. కానీ మా నాన్ని ఇండియాతోనే ఉంటామని చెప్పాడు. పాకిస్తాన్‭ ఇప్పటికీ ఆశించిన సాధికారత సాధించలేదు. మాకు ఇది గుర్తే ఉంది’’ అని అన్నారు.

Satyendar Jain Jail Video: అది మసాజ్ కాదు, వైద్యం.. జైలులో ఉన్న సత్యేంద్ర వీడియోపై ఆప్ సమాధానం