Satyendar Jain Jail Video: అది మసాజ్ కాదు, వైద్యం.. జైలులో ఉన్న సత్యేంద్ర వీడియోపై ఆప్ సమాధానం

ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ ‘‘ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? జైలులో సత్రేంద్ర జైన్‭కు మసాజ్ చేస్తున్నారు, వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయి. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదని ఆప్ నేతలు అనుకుంటున్నారా? అసలు జైలు నియమ నిబంధనల ప్రకారం.. ఆయనను చూస్తున్నారా? ఆప్ అన్ని చట్టాల్ని చెత్త బుట్టలో వేసింది. నేరస్తుల్ని ఆప్ కాపాడుతోందనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ’’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Satyendar Jain Jail Video: అది మసాజ్ కాదు, వైద్యం.. జైలులో ఉన్న సత్యేంద్ర వీడియోపై ఆప్ సమాధానం

Treatment for injury says Delhi Dy CM Manish Sisodia on Satyendar Jain viral video

Satyendar Jain Jail Video: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్రేంద్ర జైన్‭కు సంబంధించిన ఓ వీడియో రాజకీయంగా దుమారాన్ని లేపింది. ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో ఇక బీజేపీ, ఆప్ పార్టీల మధ్య తీవ్ర యుద్ధానికి దారి తీసింది. ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేస్తూ ‘‘జైలులో మాజీ మంత్రికి రాచమర్యాదలు, మసాజ్‭లు’’ అంటూ బీజేపీ విరుచుకు పడుతుండగా.. అది మసాజ్ కాదని, గాయానికి చికిత్స చేస్తున్నారని బీజేపీ విమర్శల్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తోంది ఆప్.

ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ ‘‘ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? జైలులో సత్రేంద్ర జైన్‭కు మసాజ్ చేస్తున్నారు, వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయి. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదని ఆప్ నేతలు అనుకుంటున్నారా? అసలు జైలు నియమ నిబంధనల ప్రకారం.. ఆయనను చూస్తున్నారా? ఆప్ అన్ని చట్టాల్ని చెత్త బుట్టలో వేసింది. నేరస్తుల్ని ఆప్ కాపాడుతోందనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ’’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే బీజేపీ విమర్శలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందిస్తూ ‘‘గాయపడ్డ వ్యక్తులపై జోకులు వేయడం ఒక్క భారతీయ జనతా పార్టీ నేతలకే సాధ్యం. వాస్తవానికి సత్యేంద్ర జైన్ నడుము దెబ్బతిన్నది. దానికితోడు ఆయనకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాటికి ఆయన చికిత్స చేయించుకున్నారు. దాన్ని మసాజ్ అని, ఎంజాయ్ అని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం మూర్ఖత్వం’’ అని అన్నారు.

Strange Video: చైనాలో అంతుచిక్కని గొర్రెల వింత ప్రవర్తన.. 12 రోజులుగా వృత్తాకారంలో తిరుగుతూనే ఉన్నాయి