Strange Video: చైనాలో అంతుచిక్కని గొర్రెల వింత ప్రవర్తన.. 12 రోజులుగా వృత్తాకారంలో తిరుగుతూనే ఉన్నాయి

కొన్ని పదుల సంఖ్యలో గొర్రెలు సవ్యదిశలో సమూహంగా తిరగడం చూడొచ్చు. కొన్ని ఎలాంటి దిశ లేకుండా కదులుతున్నాయి. అయితే ఒక దిశలో తిరిగే గొర్రెలు, కచ్చితమైన వృత్తాకారంలో తిరుగుతున్నాయి. అలా తిరుగుతూనే ఉన్నాయి. ఈ వృత్తాకారంలో కొన్ని గొర్రెలు కలుస్తున్నాయి, కొన్ని వదిలి వెళ్తున్నాయి. కానీ, మొత్తంగా గొర్రెలంతా వృత్తాకారాన్ని వదలకుండా తిరుగుతూనే ఉన్నాయి

Strange Video: చైనాలో అంతుచిక్కని గొర్రెల వింత ప్రవర్తన.. 12 రోజులుగా వృత్తాకారంలో తిరుగుతూనే ఉన్నాయి

Strange video of sheep walking around in a circle for 12 days in China

Strange Video: చైనాలో కొన్ని పదుల సంఖ్యలోని గొర్రెలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. దాదాపుగా 12 రోజులుగా గొర్రెలన్నీ ఒక వృత్తాకారంలో తిరుగుతున్నాయి. అయితే అవి అలా ఎందుకు తిరుగుతున్నాయనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఉత్తర చైనాలోని మంగోలియాకు సమీపంలో ఉన్న ఓ ప్రాంతంలో ఇది వెలుగు చూసినట్లు చైనా అధికారిక మీడియా సంస్థ పీపుల్స్ డైలీ చైనా పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వీడియో ప్రకారం.. కొన్ని పదుల సంఖ్యలో గొర్రెలు సవ్యదిశలో సమూహంగా తిరగడం చూడొచ్చు. కొన్ని ఎలాంటి దిశ లేకుండా కదులుతున్నాయి. అయితే ఒక దిశలో తిరిగే గొర్రెలు, కచ్చితమైన వృత్తాకారంలో తిరుగుతున్నాయి. అలా తిరుగుతూనే ఉన్నాయి. ఈ వృత్తాకారంలో కొన్ని గొర్రెలు కలుస్తున్నాయి, కొన్ని వదిలి వెళ్తున్నాయి. కానీ, మొత్తంగా గొర్రెలంతా వృత్తాకారాన్ని వదలకుండా తిరుగుతూనే ఉన్నాయి. ఇలా 12 రోజులుగా తిరుగుతున్నాయట. ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఇలా ఎన్ని రోజులు తిరుగుతాయో కూడా చెప్పలేం అంటున్నారు. అంతే కాకుండా, ఆ గొర్రెలు ఎందుకు అలా తిరుగుతున్నాయనేది కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు.

మొదట తక్కువ గొర్రెలు ఇలా ప్రవర్తించాయట. క్రమంగా వాటికి తోడుగా మరిన్ని గొర్రెలు చేరుతున్నాయని ఆ గొర్రెల యజమాని పేర్కొన్నాడు. అయితే ఆ గొర్రెలు లిస్టెరియోసిస్ అనే బాక్టీరియల్ వ్యాధి వల్ల అలా చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిని “సర్క్లింగ్ డిసీజ్” అని కూడా పిలుస్తారని వారు పేర్కొన్నారు.

Fenugreek Curry : శీతాకాలంలో మెంతి కూరను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు!