Tweet Characters Increase : ట్విటర్ లో యూజర్లకు కొత్తగా మరో ఫీచర్.. ట్వీట్ లో అక్షరాల సంఖ్య 10 వేలకు పెంపు!

ట్విటర్ లో యూజర్లకు కొత్తగా మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ట్వీట్ లో అక్షరాల పరిమితిని త్వరలో 10వేలకు పెంచుతున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. దీంతో యూజర్లు ఒకే ట్వీట్ లో ఎక్కువ టెక్స్ట్ రాయవచ్చు.

twitter

Tweet Characters Increase : ట్విటర్ లో యూజర్లకు కొత్తగా మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ట్వీట్ లో అక్షరాల పరిమితిని త్వరలో 10వేలకు పెంచుతున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. దీంతో యూజర్లు ఒకే ట్వీట్ లో ఎక్కువ టెక్స్ట్ రాయవచ్చు. ట్విటర్ లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్ బదులిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ ఫీచర్ ట్విటర్ బ్లూ సబ్ స్క్రైబర్స్ కు మాత్రమేనా? లేక సాధారణ యూజర్లకు సైతం అందుబాటులో ఉంటుందా? అనేది ఇంకా ప్రకటించలేదు.

పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే యూజర్లకు అందుబాబులోకి రానుంది. ప్రస్తుతం ట్విటర్ లో ఒక ట్వీట్ లో అక్షరాల పరిమితి 280గా ఉంది. గతంలో ఈ పరిమితి 140గా ఉండేది. 2017లో దాన్ని 280కి పెంచారు. గతేడాది 4 వేల అక్షరాలకు పెంచారు. అయితే ఇది కేవలం అమెరికాలోని ట్విటర్ బ్లూ సబ్ స్ర్ర్కైబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా మస్క్ ప్రకటనతో మరోసారి ట్వీట్ లో అక్షరాల సంఖ్య పెరుగనుంది.

Elon Musk: విమర్శలతో వెనక్కు తగ్గిన ఎలన్ మస్క్.. జర్నలిస్టుల అకౌంట్లు రీస్టోర్ చేసిన ట్విట్టర్

మరోవైపు ట్విటర్ ఆదాయాన్ని పెంచేందుకు, ట్విటర్ బ్లూ సబ్ స్క్రైబర్స్ ను పెంచుకునేందుకు మస్క్ ఆసక్తి చూపుతున్నారు. సబ్ స్ర్కిప్షన్ రెవెన్యూ లేకుండా ట్విటర్ ను కొనసాగించడం సాధ్యం కాదని, ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మస్క్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్విటర్ బ్లూ మాత్రం మస్క్ ఆశించినంతగా విజయం సాధించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ట్వీట్ లో పది వేల అక్షరాల పరిమితి అందరికీనా? లేక కొందరికేనా అనే దానిపై ఆసక్తి నెలకొంది.