Elon Musk: విమర్శలతో వెనక్కు తగ్గిన ఎలన్ మస్క్.. జర్నలిస్టుల అకౌంట్లు రీస్టోర్ చేసిన ట్విట్టర్

‘డాక్సింగ్’కు పాల్పడ్డ పలువురు జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లను ఎలన్ మస్క్ శుక్రవారం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. పలు ప్రభుత్వ సంస్థలు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, ప్రభుత్వాలు ఈ చర్యను ఖండించాయి.

Elon Musk: విమర్శలతో వెనక్కు తగ్గిన ఎలన్ మస్క్.. జర్నలిస్టుల అకౌంట్లు రీస్టోర్ చేసిన ట్విట్టర్

Elon Musk: తన నిర్ణయంపై ట్విట్టర్‌లో వెల్లువెత్తిన విమర్శలతో ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ వెనక్కు తగ్గాడు. తను సస్పెండ్ చేసిన అకౌంట్లను ఒక్క రోజులోనే రీస్టోర్ చేశాడు. ‘డాక్సింగ్’కు పాల్పడ్డ పలువురు జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లను ఎలన్ మస్క్ శుక్రవారం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్, వాయిస్ ఆఫ్ అమెరికా వంటి ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టుల అకౌంట్లను ఎలన్ మస్క్ సస్పెండ్ చేశాడు.

India vs Bangladesh: ఇండియా-బంగ్లాదేశ్ తొలి టెస్ట్.. ముగిసిన నాలుగో రోజు ఆట.. విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్

‘డాక్సింగ్’కు పాల్పడ్డందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ‘డాక్సింగ్’ అంటే వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన అడ్రస్, వాహన వివరాలు, టూర్లు వంటి వివరాల్ని ఆన్‌లైన్‌లో వారి అనుమతి లేకుండా వెల్లడించడం. దీని వల్ల వారి వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఎలన్ మస్క్‌కు సంబంధించిన విమానంతోపాటు ఇతర వివరాల్ని కొందరు జర్నలిస్టులు బయటపెట్టారు. దీంతో ‘డాక్సింగ్’ పేరుతో వారి అకౌంట్లను సస్పెండ్ చేశాడు. అయితే, ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. పలు ప్రభుత్వ సంస్థలు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, ప్రభుత్వాలు ఈ చర్యను ఖండించాయి. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఈయూ వంటివి జర్నలిస్టుల అకౌంట్లు సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టాయి. ఈ విమర్శలు ఎక్కువ కావడంతో స్పందించిన ఎలన్ మస్క్ ట్విట్టర్ పోల్ కూడా నిర్వహించాడు.

Agni-V Missile: మరింత పవర్‌ఫుల్‌గా ‘అగ్ని-5 క్షిపణి’.. 7,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించే సత్తా

జర్నలిస్టుల అకౌంట్లు రీస్టోర్ చేయాలా.. వద్దా అంటూ పోలింగ్ నిర్వహించాడు. దీనిలో ఎక్కవ మంది వారి అకౌంట్లను రీస్టోర్ చేయాలని సూచించారు. దీంతో జర్నలిస్టుల అకౌంట్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మస్క్ ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో మస్క్ ఒక్క రోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకోవడం విశేషం. మరోవైపు జర్నలిస్టుల అకౌంట్ల సస్పెన్షన్ ప్రభావం మస్క్ సంస్థ టెస్లా షేర్లపై పడింది. శుక్రవారం టెస్లా షేర్లు ఏకంగా 4.7 శాతం పడిపోయాయి. 2020 మార్చి తర్వాత ఈ స్థాయిలో షేర్లు పతనమవ్వడం ఇదే మొదటిసారి.