India vs Bangladesh: ఇండియా-బంగ్లాదేశ్ తొలి టెస్ట్.. ముగిసిన నాలుగో రోజు ఆట.. విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్

ఇండియా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు నాలుగో రోజు ఆట శనివారం ముగిసింది. 513 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 6 వికెట్లు కోల్పోయింది. ఇండియా గెలవాలంటే మరో 4 వికెట్లు తీయాలి.

India vs Bangladesh: ఇండియా-బంగ్లాదేశ్ తొలి టెస్ట్.. ముగిసిన నాలుగో రోజు ఆట.. విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్

Updated On : December 17, 2022 / 5:09 PM IST

India vs Bangladesh: ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. శనివారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 272 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే మరో 241 పరుగులు చేయాలి. భారత విజయానికి 4 వికెట్లు కావాలి.

Gangster Goldy Brar: గోల్డీ బ్రార్ వ్యవహారం టాప్ సీక్రెట్.. అమెరికాతో చర్చిస్తున్నాం: పంజాబ్ సీఎం భగవంత్ మన్

ఆదివారం మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉంది. లేదంటే డ్రాగా ముగుస్తుంది. నాలుగో రోజు 42/0 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మొదట నిలకడగా ఆడింది. ఓపెనర్లు జకీర్ హసన్, నజ్ముల్ షాంటో నెమ్మదిగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. నజ్ముల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతడు టెస్టుల్లో సాధించిన మూడో హాఫ్ సెంచరీ. తర్వాత జకీర్ హసన్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతడి తొలి టెస్ట్ మ్యాచ్. తర్వాత కొద్దిసేపటికే 67 పరుగులు చేసిన నజ్ముల్ 124 పరుగుల వద్ద ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యాసిన్ అలీ 12 బంతుల్లో 5 పరుగులే చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన లిటన్ దాస్ 19 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన జకీర్ హసన్ సరిగ్గా 100 పరుగులు చేసి ఔటయ్యాడు.

Mumbai: ముంబై పిజ్జా రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం… ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

జకీర్ అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడం విశేషం. తర్వాత ముస్తాఫికర్ రహీమ్ 23 పరుగులు, నురుల్ హసన్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం షకీబ్ అల్ హసన్ 40 పరుగులతో, మెహిదీ హసన్ మిరాజ్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర పటేల్ 3 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. ఆదివారం జరిగే చివరి రోజు ఆట భారత జట్టు విజయాన్ని నిర్ణయిస్తుంది.