Elon Musk Starship rocket
Elon Musk: ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ కు ఎదురు దెబ్బ తగిలింది. మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ షిప్ రాకెట్ ప్రయోగించిన కొద్ది నిమిషాలకే నియంత్రణ కోల్పోయి పేలిపోయింది. దాని శకలాలు అమెరికాలోని దక్షిణ ప్లోరిడా, బహమాస్ దీవుల్లో పడ్డాయి. జనాలున్న స్థలాల్లోనే శకలాలు పడిపోయినప్పటికీ అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రమాదం జరగలేదు.
403 అడుగుల పొడవు (123మీటర్లు) ఉన్న ఆ రాకెట్ సూర్యాస్తమయానికి ముందు టెక్సాస్ నుంచి బయలుదేరింది. మొదటి దశలో స్పేస్ ఎక్స్ విజయవంతంగా టేకాఫ్ అయింది. కానీ, అంతరిక్ష నౌక దాని ముందుగా నిర్ణయించిన మార్గంలో ముందుకు సాగలేకపోయింది. ఫలితంగా నియంత్రణ కోల్పోయి పేలిపోయింది.
స్పేస్ ఎక్స్ లైవ్ స్ట్రీమ్ లో స్టార్ షిప్ అదుపులేకుండా తిరుగుతున్నట్లు చూపించారు. ఆ తరువాత కంపెనీ సంబంధాలు తెగిపోతున్నట్లు నివేదించింది. దీని తరువాత కొద్దిసేపటికే దక్షిణ ఫ్లోరిడా, బహమాస్ సమీపంలో ఆకాశంలో అంతరిక్ష నౌక శకలాలు అగ్నిగోలాళ్లా మండుకుంటూ వచ్చి పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో మయామి, ఫోర్ట్ లాడర్ డేల్, పామ్ బీచ్, ఓర్లాండ్ విమానాశ్రయాల్లో విమానాలు తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రయోగం విఫలంపై స్పేస్ ఎక్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయోగం సమయంలో స్టార్ షిప్ ముందుగా నిర్ణయించిన మార్గంలో వేగంగా కదలలేకపోయిందని, అందుకే తాము దానితో సంబంధాన్ని కోల్పోయామని పేర్కొంది. ప్రయోగం వైఫల్యంపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని స్పేస్ ఎక్స్ అనౌన్స్ చేసింది.
Jamaica #spacex pic.twitter.com/lepN4AkfXh
— Kcie Gallagher (@kciedea) March 6, 2025
ఇదిలాఉంటే.. దాదాపు రెండు నెలల తరువాత ఈ ప్రయోగం జరిగింది. జనవరిలో స్పేస్ ఎక్స్ ప్రయోగించిన భారీ రాకెట్ స్టార్ షిప్ ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. భూవాతావరణంలోకి ప్రవేశించగానే పెద్ద శబ్దంతో పేలిపోయింది. రాకెట్ శకలాలు కరేబియన్ సముద్రంలో పడ్డాయి. సాంకేతిక లోపాల కారణంగానే ప్రయోగం విఫలమైందని అప్పట్లో స్పేస్ ఎక్స్ ప్రకటించింది. తాజాగా.. మరోసారి స్టార్ షిప్ ప్రయోగం విఫలమైంది.
We just saw the SpaceX Starship 8 blow up. 💥💥💥 Seen from Turks and Caicos. pic.twitter.com/1AyGANrBfE
— Mark O’Henly (@SeeClickFlash) March 6, 2025