ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌కు గుడ్‌ బై చెప్పేసిన ఎలాన్‌ మస్క్‌.. థ్యాంక్స్‌ ట్రంప్‌ అంటూ..

డోజ్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు.

Elon Musk

టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (డోజ్) బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి తాను వైదొలుగుతున్నట్లు తెలుపుతూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

స్పెషల్ గవర్నమెంట్‌ ఉద్యోగిగా తన షెడ్యూల్‌ ముగిసిందని ఎలాన్ మస్క్‌ చెప్పారు. గవర్నమెంట్‌లో వృథా ఖర్చులను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డాజ్‌లో తనకు ఛాన్స్‌ ఇచ్చినందుకు ట్రంప్‌కు ఆయన థ్యాంక్స్‌ తెలిపారు. “డోజ్‌” మిషన్‌ మాత్రం కొనసాగుతుందని, భవిష్యత్తులో మరింత బలపడుతుందని చెప్పారు.

మస్క్‌ను డొనాల్డ్ ట్రంప్‌ డోజ్‌ శాఖకు చీఫ్‌గా నియమించిన విషయం విదితమే. గవర్నమెంట్‌ సిస్టమ్‌లో మార్పులు చేయడంతో పాటు వృథా ఖర్చులు తగ్గించడమే డోజ్ బాధ్యత.

తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఎలాన్ మస్క్ సంచనల నిర్ణయాలు తీసుకోవడంతో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. ఖర్చులను తగ్గిచుకునే క్రమంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వానికి డోజ్‌ సూచనలు చేయడంతో మస్క్‌ జోక్యం పెరిగిపోయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

డోజ్‌ చీఫ్‌గా మే 30తో ఎలాన్ మస్క్‌ పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మస్క్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మస్క్‌ డోజ్‌ నుంచి తప్పుకుంటున్నప్పటికీ ఆ విభాగం కొనసాగుతుంది.