Elon Musk : యుగాంతం లోపు మస్క్ మామకు ‘పిల్లల సైన్యం’ కావాలంట.. ఎక్స్ వేదికగా పిల్లల్ని కనేవారి కోసం వెతుకులాట..!

Elon Musk : ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా మహిళలను సంప్రదించి వారిని తనతో బిడ్డను కనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రపంచ జనాభా సంక్షోభాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా మస్క్ ఏకంగా పిల్లల సైన్యాన్నే తయారు చేసే పనిలో పడ్డాడు.

Elon Musk

Elon Musk : ప్రపంచ కుబేరుడు అన్నంత పనిచేస్తున్నాడుగా.. పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకున్నాడు.. తనకు బిడ్డ కని ఇచ్చే మహిళల కోసం తెగ వెతుకుతున్నాడు.. యుగాంతం లోపు ఎంత వీలైతే అంత మంది పిల్లల్ని కనడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రపంచ జనాభాను మరింత పెంచే దిశగా మస్క్ మామ అడుగులు వేస్తున్నాడు. జనాభా సంక్షోభాన్ని తగ్గించి పిల్లల్ని కనేందుకు మస్క్​ ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా తన ఎక్స్ ప్లాట్ ఫారాన్ని వాడేస్తున్నాడు.

Read Also : iPhone 18 Price : ఆపిల్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. రాబోయే ఐఫోన్ 18 ధర భారీగా పెరగొచ్చు.. మీరు ఊహించలేరంతే..!

ఎక్స్ వేదికగా మహిళల నియామకం :
వాల్ స్ట్రీట్ జర్నల్‌ (WSJ) కొత్త నివేదిక ప్రకారం.. ఎలన్ మస్క్ ఎక్స్​వేదికగా తనకు బిడ్డను కని ఇచ్చే మహిళల కోసం వెతుకుతున్నాడు. ఇప్పటికే ఆసక్తి ఉన్న మహిళలను రిక్రూట్ కూడా చేసుకుంటున్నాడట.. ముందుగా ఆయా మహిళలతో మాట్లాడి వారికి ఇష్టమైతే వారితో పిల్లలు కంటారని నివేదిక వెల్లడించింది.

కొత్త నివేదిక ప్రకారం.. ‘పిల్లల సైన్యాన్ని తయారుచేయడమే తన లక్ష్యం’ అని మస్క్ అన్నారు. జనాభా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు బిలియనీర్ టెక్ దిగ్గజం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎంతమందితో అయినా పిల్లలను కనేందుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. మస్క్ ఎక్స్ ద్వారా అనేక మంది మహిళలను ప్రైవేట్‌గా సంప్రదించాడు. వారితో పిల్లల్ని కనేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు.

మొత్తం 14 మంది సంతానం.. :
మస్క్ మామకు ఇప్పటికే 14 మంది సంతానం. మొత్తం నలుగురు మహిళల ద్వారా పదికిపైగా పిల్లలను కన్నారు. సింగర్ గ్రిమ్స్, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్, మాజీ భార్య జస్టిన్, కన్జర్వేటివ్ ఇన్‌ఫ్లుయెన్సర్ యాష్లే సెయింట్ క్లెయిర్ ద్వారా టెస్లా అధినేత 14 మంది పిల్లల్ని పొందారు. అయితే, అంతటితో ఆగేలా కనిపించడం లేదు మస్క్.. ఇంకా వీలైనంత మంది పిల్లల్ని కనాలని ఆరాటపడుతున్నారు.

ఈ పిల్లల సంఖ్యను మరింత పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని మస్క్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఇన్‌ఫ్లుయెంజర్​ఆష్లే సెయింట్ క్లెయిర్‌ని కూడా మస్క్​సంప్రదించారట. ముందుగా ఆష్లే పోస్టులను ఆయన లైక్ చేశారు. ఆమెతో ప్రైవేటుగా కామెంట్లు కూడా చేశారట.. అలా వారిద్దరి మధ్య సంబంధం బలపడింది. ఆ తర్వాత నేరుగా ఎక్స్ ఆఫీసుకు పిలిపించుకున్నాడట. మస్క్‌తో రిలేషన్ కాస్తా 2023లో రోములస్ అనే బిడ్డకు జన్మనిచ్చింది.

మస్క్ పేరు బయటపెట్టిన సెయింట్ క్లెయిర్‌ :
ఫిక్సర్ జారెడ్ బిర్చల్ నేతృత్వంలోని మస్క్ బృందం ఒక ఒప్పందాన్ని కూడా ప్రతిపాదించింది. పిల్లాడి తండ్రి పేరును రహస్యంగా ఉంచాలని, ముందుగా 15 మిలియన్ డాలర్లు, బిడ్డకు 21 ఏళ్లు నిండే వరకు నెలకు లక్ష డాలర్లు.. అప్పటివరకూ మౌనంగా ఉండాలని కండిషన్ పెట్టారట.. అందుకు సెయింట్ క్లెయిర్ నిరాకరించింది. అప్పటి నుంచి ఆమె మస్క్ చర్యలను వ్యతిరేకిస్తోంది. తన కొడుకు ఒక రహస్య వ్యక్తిలా భావించడం ఇష్టం లేదని ఫోన్ కాల్‌లో చెప్పింది.

అంతేకాదు.. మస్క్ బృందం తనకు కేవలం 20వేల డాలర్లు మాత్రమే పంపిందని సెయింట్ క్లెయిర్ చెప్పారు. తాను మస్క్ పేరును బహిర్గతం చేశాక నెలకు 40 వేల డాలర్లకు తగ్గించారని తెలిపింది. తనకు పిల్లల సైన్యం ‘లెజియన్’ కావాలని మస్క్ చెప్పినట్లు క్లెయిర్ అసలు విషయం బయటపెట్టినట్టు నివేదిక తెలిపింది.

అయితే, పిల్లలను కనాలనే ఒప్పందంలో భాగంగా ఆయా తల్లులకు డబ్బు ఆశ చూపి మస్క్ ఆ పిల్లలను ప్రపంచానికి తెలియకుండా నియంత్రిస్తున్నారని ఇప్పటికే చాలామంది మహిళలు ఆరోపించినట్లు నివేదిక పేర్కొంది. మస్క్ ‘బహిరంగంగా తెలిసిన 14 మంది పిల్లల కన్నా చాలా ఎక్కువ మంది’ పిల్లలకు తండ్రులై ఉండవచ్చని నివేదిక సూచిస్తుంది. అయితే, కచ్చితమైన సంఖ్య అస్పష్టంగానే ఉంది. అదేవిధంగా, జపాన్‌కు చెందిన ఒక మహిళ కోరడంతో మస్క్ వీర్యదానం కూడా చేసినట్లు నివేదిక వెల్లడించింది.

మస్క్ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ ‘టిఫనీ ఫాంగ్’ను కూడా ఎక్స్ ద్వారా సంప్రదించాడు. పబ్లిక్ లైక్స్, ప్రైవేట్ మెసేజ్‌లతో మస్క్ ఆమెతో పరిచయడం పెంచుకున్నారు. ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవకపోయినా తన బిడ్డను కని ఇవ్వాలని ప్రతిపాదించాడు.

Read Also : Samsung Galaxy M56 5G : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త శాంసంగ్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ఇలా చేస్తే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు..!

అయితే మస్క్ అభ్యర్థనను ఫాంగ్ నిరాకరించింది. కానీ, ఆమె స్నేహితులతో ఇదే విషయాన్ని చెప్పింది. అది తెలిసిన మస్క్ వెంటనే ఆమెతో రిలేషన్ కట్ చేశాడు. ఆ తరువాత ఆమెను ప్లాట్‌ఫారమ్ రెవిన్యూ ప్లాట్‌ఫారం ప్రొగ్రామ్ నుంచి తొలగించారు.

మస్క్ ప్రోనాటలిజం మిషన్‌కు ప్రైవసీ చాలా కీలకం. “జనన రేటు పడిపోవడం నాగరికత ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం” అని మస్క్ అనేక సార్లు చెప్పారు. 2023లో సౌదీ పెట్టుబడి ఫోరమ్‌కు చెప్పిన నివేదిక ప్రకారం.. “ఎక్కువ మంది పిల్లలు పుట్టకపోతే మనం నాశనం అయిపోతాం.” అని పేర్కొన్నారు. జన్యుపరంగా మహిళలతో ఒక పిల్లల సైన్యాన్ని తయారు చేయాలని మస్క్ కలలు కన్నాడు. మస్క్ భవిష్యత్ తల్లుల కోసం సరోగసీ గురించి కూడా చర్చించాడు.