Samsung Galaxy M56 5G : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త శాంసంగ్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ఇలా చేస్తే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు..!

Samsung Galaxy M56 5G : శాంసంగ్ గెలాక్సీ M56 సిరీస్ వచ్చేసింది. సింగిల్ వేరియంట్‌లో ఏప్రిల్ 23 నుంచి అమ్మకానికి రానుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు కొనుగోలుపై రూ. 3వేలు తగ్గింపును పొందవచ్చు.

Samsung Galaxy M56 5G : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త శాంసంగ్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ఇలా చేస్తే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు..!

Samsung Galaxy M56 5G

Updated On : April 17, 2025 / 6:01 PM IST

Samsung Galaxy M56 5G : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ M56 పేరుతో కంపెనీ M సిరీస్ లైనప్‌‌లో ప్రవేశపెట్టింది.

గత ఏప్రిల్‌లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ M55కు అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ కొత్త ఫోన్‌లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, 12MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ముందున్న శాంసంగ్ గెలాక్సీ M55 కన్నా 30 శాతం సన్నగా ఉంటుంది. 7.8mm మందంతో ఉంది. ఇంకా, శాంసంగ్ గెలాక్సీ M56లో 36 శాతం సన్నగా ఉండే బెజెల్స్, పాత మోడల్‌తో పోలిస్తే.. 33 శాతం ఆకర్షణీయమైన డిస్‌ప్లే ఉన్నాయి.

Read Also : Meta Apple Intelligence : ఆపిల్ యూజర్లకు మెటా షాక్.. ఇన్‌స్టా‌గ్రామ్, వాట్సాప్‌లో ఆ ఫీచర్ కట్..!

భారత్‌లో గెలాక్సీ M56 5G ధర ఎంతంటే? :
దేశీయ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M56 5G ఫోన్ సింగిల్ వేరియంట్ (8GB + 128GB) కాన్ఫిగరేషన్ ధర రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో కొనుగోళ్లకు అందుబాటులో ఉంటాయి. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లు రూ. 3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ M56 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ M56 5G ఫోన్ 6.73-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,340 పిక్సెల్స్) అమోల్డ్+ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ సపోర్ట్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 8GB (LPDDR5X) ర్యామ్, 256GB వరకు UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. బాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. వన్ UI 7తో లేయర్, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు 6 ఏళ్ల ప్రధాన OS అప్‌డేట్స్ అందుకుంటుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ M56 5G మల్టీఫేస్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరా, HDR వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇచ్చే 12MP ఫ్రంట్ కెమెరాతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈ శాంసంగ్ ఫోన్ ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్ ఎడిట్ టిప్స్ వంటి అనేక ఏఐ ఇమేజింగ్ ఫీచర్లను కూడా అందిస్తుంది.

Read Also : iPhone 18 Price : ఆపిల్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. రాబోయే ఐఫోన్ 18 ధర భారీగా పెరగొచ్చు.. మీరు ఊహించలేరంతే..!

శాంసంగ్ గెలాక్సీ M56 5Gలో 45W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీని అమర్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB టైప్-C వంటి కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 7.2mm మందం, 180 గ్రాముల బరువు ఉంటుంది.