iPhone 18 Price : ఆపిల్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. రాబోయే ఐఫోన్ 18 ధర భారీగా పెరగొచ్చు.. మీరు ఊహించలేరంతే..!
iPhone 18 Price : ఆపిల్ ఐఫోన్ 18 ధర ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ A20 చిప్‌సెట్‌తో వస్తుందని పుకార్లు, లీక్‌లు సూచించాయి.

iPhone 18 Price
iPhone 18 Price : ఆపిల్ ట్రెండ్ ప్రకారం.. ఐఫోన్ 18 సిరీస్ 2026లో లాంచ్ కానుంది. రాబోయే ఆపిల్ ఐఫోన్ 18 లైనప్‌లో నెక్స్ట్-జెన్ A20 చిప్ ఉంటుందని భావిస్తున్నారు. చిప్ మేకర్ TSMC కంపెనీ అడ్వాన్స్‌డ్ 2nm ప్రక్రియను ఉపయోగించి రూపొందించింది. ఈ కొత్త చిప్‌సెట్ మార్పుతో రాబోయే ఐఫోన్ 18 పర్ఫార్మెన్స్, కెపాసిటీని పెంచుతుంది.
అయితే, ఈ నెక్స్ట్ జనరేషన్ A20 చిప్‌సెట్ కారణంగా రాబోయే ఐఫోన్ 18 సిరీస్ ధర భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో లాంచ్ అయ్యే ఐఫోన్ 18 మోడల్స్ భారీ ధరతో మార్కెట్లోకి రానున్నాయి.
ఇప్పటివరకూ ఆపిల్ 2nm ప్రక్రియను అవలంబిస్తుందనే పుకార్లు వ్యాపించాయి. మింగ్-చి కువో, జెఫ్ పు వంటి టెక్ విశ్లేషకులు సైతం వాస్తవమేనని విశ్వసిస్తున్నారు. దాంతో ఐఫోన్ 18పై అంచనాలను మరింత పెంచుతోంది.
ఐఫోన్ 18లో 2nm చిప్ :
ఆపిల్ చిప్ తయారీ పార్టనర్ (TSMC) కంపెనీ 2025 చివరి నాటికి 2nm చిప్‌ల ఉత్పత్తి కోసం సన్నాహాలు చేస్తోంది. ఆపిల్ ఈ చిప్ మొదటగా అందుకోనుంది. అధిక డిమాండ్ ప్రకారం.. TSMC రెండు కొత్త ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌లను నిర్మిస్తోంది. మూడో వంతు అనుమతి కోరుతోందని MacRumors నివేదిక తెలిపింది.
ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్లలో ఉపయోగిస్తున్న 3nm టెక్నాలజీ కన్నా 2nm చిప్‌సెట్ భారీ అప్‌గ్రేడ్‌ను సూచిస్తుంది. 2023 నుంచి ఆపిల్ ఐఫోన్లు, మ్యాక్ డివైజ్‌లలో 3nm చిప్‌లను ప్రవేశపెడుతుంది. రాబోయే ఐఫోన్ 17 అప్‌గ్రేడ్‌లో 3nm వేరియంట్ (N3P)ను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. కానీ, ఐఫోన్ 18 2nmకు మార్చడం వల్ల అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుందని అంచనా.
3nm, 2nm వంటి చిప్ తయారీ జనరేషన్ వేర్వేరుగా ఉంటాయి. ఈ నోడ్‌లు తగ్గుతున్న కొద్ది ట్రాన్సిస్టర్‌లు కూడా చిన్నవిగా మారతాయి. ఇందులో ఎక్కువ ఒకే చిప్‌లో సరిపోయేలా ఉంటాయి. స్పీడ్ ప్రాసెసింగ్ మాత్రమే కాదు.. పవర్ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ఐఫోన్ 18 ధర భారీగా పెరగొచ్చు.. ప్రధాన కారణాలివే :
ఐఫోన్ 18 ధర భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇందులో 2nm చిప్ కలిగి ఉండటం ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు. కానీ, ఇది ఒక్కటే కారణం కాదు.. ప్రస్తుత ట్రేడ్ వార్ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇతర అంశాలు కూడా కారణాలుగా చెప్పవచ్చు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం సెమీకండక్టర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త సుంకాలను అమలు చేస్తోంది.
గతంలో చైనా, చైనాయేతర దిగుమతులపై 145 శాతం, 10 శాతం సుంకాల నుంచి తాత్కాలిక మినహాయింపు ఉన్నప్పటికీ, ఆపిల్ త్వరలో కొత్త సుంకాలను ఎదుర్కోవలసి రావచ్చు. ట్రంప్ ఇటీవలే టారిఫ్స్ ఎవరూ తప్పించుకోలేరు.. ఆపిల్‌తో సహా టెక్ సంస్థలు కొత్త టారిఫ్ వంటి అదనపు ఛార్జీలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.
Read Also : Meta Apple Intelligence : ఆపిల్ యూజర్లకు మెటా షాక్.. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో ఆ ఫీచర్ కట్..!
ఫలితంగా, నెక్స్ట్-జెన్ చిప్ టెక్నాలజీ, పెరిగిన వాణిజ్య అడ్డంకులతో ఐఫోన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 18కి మాత్రమే కాకుండా, ఐఫోన్ 17 సిరీస్ ధరలు కూడా పెరగొచ్చు. ఇటీవల, ఆపిల్ ట్రంప్ విధించిన సుంకాలను అధిగమించేందుకు 600 టన్నుల ఐఫోన్‌లను భారతీయ విమానంలో అమెరికాకు పంపించింది. అయితే, ఆపిల్ ఐఫోన్ ధరలపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆపిల్ అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే మరి.