Meta Apple Intelligence : ఆపిల్ యూజర్లకు మెటా షాక్.. ఇన్‌స్టా‌గ్రామ్, వాట్సాప్‌లో ఆ ఫీచర్ కట్..!

Meta Apple Intelligence : ఐఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఇకపై వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్‌లో సపోర్టు చేయవు. మెటా ఆపిల్ ఏఐ ఫీచర్లను బ్లాక్ చేస్తోంది.

Meta Apple Intelligence : ఆపిల్ యూజర్లకు మెటా షాక్.. ఇన్‌స్టా‌గ్రామ్, వాట్సాప్‌లో ఆ ఫీచర్ కట్..!

Meta Apple Intelligence

Updated On : April 17, 2025 / 5:10 PM IST

Meta Apple Intelligence : ప్రపంచ టెక్ దిగ్గజం ఇటీవలే భారత్‌లో ఆపిల్ సొంత ఇంటెలిజెన్స్ ఫీచర్లను రిలీజ్ చేసింది. దేశంలో ఐఫోన్ యూజర్లు డిఫాల్ట్ సెట్టింగ్‌లో జెన్‌మోజీ, రైటింగ్ టూల్స్, ఇమేజ్ జనరేషన్ మరిన్నింటితో సహా AI-ఆధారిత ఫీచర్‌లను ఉపయోగించవచ్చు. అయితే, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ వాడే సమయంలో లిమిట్స్ ఉండవచ్చు.

Read Also : Honda Dio 125 : కొత్త స్కూటర్ కొంటున్నారా? హోండా డియో 125 స్కూటర్ భలే ఉందిగా.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

మెజారిటీ యాప్స్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు డిఫాల్ట్ సపోర్టు అందిస్తున్నాయి. అందులో డెవలపర్లకు మాత్రం ఆప్షన్ నిలిపివేసింది. మెటా కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకుంది. బ్రెజిలియన్ బ్లాగ్ సోర్సెరర్‌హాట్ టెక్ రిపోర్టు ప్రకారం.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, థ్రెడ్స్ వంటి మెటా యాజమాన్యంలోని యాప్‌లు ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇవ్వవు.

ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు సాధారణంగా టెక్స్ట్ ఫీల్డ్‌ను ట్యాప్ చేయడం ద్వారా ఆపిల్ రైటింగ్ టూల్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. కానీ, ఈ యాక్టివిటీ మెటా iOS యాప్స్ మాదిరిగా సపోర్టు ఉండదు. గతంలో, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఇదే విధంగా సపోర్టు అందించింది.

కానీ ఇకపై అలా కాదు. ఆపిల్ ఏఐ జనరేటెడ్ కస్టమ్ ఎమోజీ జెన్‌మోజీ కూడా సపోర్టు ఉండదని నివేదికలు సూచించాయి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలకు కీబోర్డ్ స్టిక్కర్లు, మెమోజీని యాడ్ చేసే సపోర్టును కూడా మెటా తొలగించినట్లు తెలిసింది. ఈ ఫీచర్ గతంలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకు అందుబాటులో లేదు.

ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు బ్లాక్ :
ఇన్‌స్టాగ్రామ్ రైటింగ్ టూల్స్, జెన్మోజీ ఫీచర్లు రెండింటినీ మెటా బ్లాక్ చేసింది. వాట్సాప్ ఇప్పటికీ జెన్మోజీని క్రియేట్ చేయగలదు. వాట్సాప్ ఎమోజి కీబోర్డ్‌పై క్లిక్ చేస్తే.. మీరు ఇప్పటికీ జెన్మోజీని క్రియేట్ చేసే ఆప్షన్ చూడొచ్చు. అంటే.. ఏఐ ఫీచర్లను మెటా దశలవారీగా బ్లాక్ చేస్తుంది అనమాట. ఆపిల్ అధికారికంగా ఈ ఏఐ టూల్స్ రిలీజ్ చేసినా మెటా iOS యాప్‌లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టును నిలిపివేసింది.

ఆపిల్ ఇంటెలిజెన్స్ డిఫాల్ట్‌గా ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లకు జెన్‌మోజీ, రైటింగ్ టూల్స్, ఇమేజ్ జనరేషన్ వంటి కొత్త AI-ఆధారిత ఫీచర్లను రిలీజ్ చేస్తుండగా మెటా ఆపిల్ యాప్‌లను ఇంటిగ్రేట్ చేయకుండా నిలిపివేసినట్లు కనిపిస్తోంది. ఆసక్తికరంగా, వాట్సాప్ ఇప్పటికీ కొంత ఆపిల్ ఇంటెలిజెన్స్ యాక్టివిటీని సపోర్టు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అంతేకాదు.. ఎమోజి కీబోర్డ్‌ను యాక్సెస్ చేయగానే వినియోగదారులు ఇప్పటికీ జెన్మోజీ ఆప్షన్ చూడొచ్చు. ప్రస్తుతానికి ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ బ్లాక్ చేయడంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఈ నిర్ణయం మెటా ఏఐ ఎకోసిస్టమ్ మరింత పటిష్టంగా ఉండాలనే వ్యూహాంలో భాగమని చెప్పవచ్చు.

మెటా తన సొంత యాప్‌లలో ఇంటర్నల్‌గా మెటా ఏఐని మరింత విస్తరించాలని భావిస్తోంది. ఆపిల్ ఏఐని ప్లాట్‌ఫామ్‌లలో అనుమతించడం వల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చుకోవడమే కాదు.. సొంత టెక్నాలజీ ద్వారా మరింత ఎంగేజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. మెటా మాత్రం ఆపిల్ కంపెనీకి పోటీగా విభిన్న నిర్ణయాలు తీసుకుంటోంది.

Read Also : Android 16 Beta : గుడ్ న్యూస్.. ఈ స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 బీటా వచ్చేసిందోచ్.. ఇందులో మీ ఫోన్ ఉంటే ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!

వాస్తవానికి, మెటా, ఆపిల్ మధ్య పోటీ కొత్తదేం కాదు. ఈ రెండు టెక్ దిగ్గజాల మధ్య ప్రైవసీ విధానాలు, యాప్ ట్రాకింగ్ ట్రాన్స్‌పరెన్సీతో గతంలో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇప్పుడు మెటా ఐఫోన్లలో సపోర్టు చేసే iOS ఫీచర్‌లను బ్లాక్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

అయినప్పటికీ, iOS మరిన్ని ఏఐ టూల్స్ ఇంటిగ్రేట్ చేస్తూనే ఉంటుంది. మెటా బదులుగా గూగుల్ జెమిని సపోర్టు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి, మెటా యాప్‌లలో ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో ఐఫోన్ యూజర్లు లిమిటెడ్ ఆప్షన్లను మాత్రమే యాక్సస్ చేయగలరని గమనించాలి.