Android 16 Beta : గుడ్ న్యూస్.. ఈ స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 బీటా వచ్చేసిందోచ్.. ఇందులో మీ ఫోన్ ఉంటే ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!

Android 16 Beta : ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ ఆండ్రాయిడ్ 16 బీటా 4 రిలీజ్ చేసింది. ఈ బీటా వెర్షన్ అద్భుతమైన ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉంది. మీ ఫోన్లలో కూడా ఈ కొత్త అప్‌డేట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి.

Android 16 Beta : గుడ్ న్యూస్.. ఈ స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 బీటా వచ్చేసిందోచ్.. ఇందులో మీ ఫోన్ ఉంటే ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!

Android 16 Beta

Updated On : April 17, 2025 / 4:37 PM IST

Android 16 Beta : ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆండ్రాయిడ్ 16బీటా వెర్షన్ వచ్చేసింది. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫో వాడుతుంటే ఇది మీకోసమే.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అతి త్వరలో ఆండ్రాయిడ్ కొత్త స్టేబుల్ వెర్షన్‌ను రిలీజ్ చేయనుంది.

Read Also : Air Coolers Discount : కొత్త కూలర్ కొంటున్నారా? ఎయిర్ కూలర్లపై ఊహించని డిస్కౌంట్లు.. తక్కువ ధరకే ఇప్పుడే కొనేసుకోండి!

యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది. టెక్ దిగ్గజం ఈ రాబోయే వెర్షన్‌ను డెవలప్ చేస్తోంది. 2024 నుంచి ఈ ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌పై టెస్టింగ్ కొనసాగుతోంది. గూగుల్ ఇప్పటికే ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ఆండ్రాయిడ్ 16 బీటాను రిలీజ్ చేసింది.

జనవరి 2025లో కంపెనీ పబ్లిక్ బీటా అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. ప్రారంభంలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రత్యేకంగా ఈ బీటా వెర్షన్ రిలీజ్ చేసింది. అయితే, ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా టెస్టింగ్ విస్తరించింది.

ఈరోజు (ఏప్రిల్ 17న) మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్లలో అనేక ఫీచర్లు, అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 16 బీటా 4 అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులు ఇప్పుడు పిక్సెల్ ఫోన్లలోనే కాకుండా Xiaomi, OnePlus వంటి ఎంపిక చేసిన మోడళ్లలో కూడా ఆండ్రాయిడ్ 16 బీటాను యాక్సస్ చేయొచ్చు. ఈ కొత్త అప్‌డేట్ స్టేబుల్ వెర్షన్ అతి త్వరలో రిలీజ్ చేయనుంది.

ఆండ్రాయిడ్ 16 బీటా సపోర్ట్ డివైజ్‌లు :
ఆండ్రాయిడ్ 16 బీటాలో Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL, Pixel 9 Pro Fold, Pixel 8, Pixel 8 Pro, Pixel 8a, Pixel 7, Pixel 7 Pro, Pixel 7a, Pixel 6, Pixel 6 Pro, Pixel 6a వంటి అనేక పిక్సెల్ మోడళ్లకు సపోర్టు అందిస్తుంది. మీకు Xiaomi 15, Xiaomi 14T Pro లేదా OnePlus 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉంటే.. ఈ అప్‌డేట్ ద్వారా మరిన్ని కొత్త ఫీచర్లను పొందవచ్చు. ఈ కొత్త ఫీచర్ ప్రత్యేకంగా యూజర్లు, డెవలపర్ల కోసం రూపొందించింది.

Read Also : OPPO K13 5G Launch : భారీ బ్యాటరీతో ఒప్పో K13 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 21నే లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలివే!

ఈ అప్‌డేట్ ద్వారా అనేక బగ్స్, గ్లిచ్‌లకు రెడీగా ఉండండి. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలోని ఆండ్రాయిడ్ 16 బీటాలో ఐడెంటిటీ చెక్ ఫీచర్ కూడా ఉంది. ఆపిల్ ఇప్పటికే స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనే ఫీచర్ అందిస్తుంది. గత ఏడాది iOS 17.3 అప్‌డేట్‌తో తీసుకొచ్చింది. శాంసంగ్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత One UI 7 అప్‌డేట్‌లో భాగంగా (Identity Check) ఫీచర్ రిలీజ్ చేసింది.