Elon Musk: కెనడా ప్రధాని ట్రూడోపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎలాన్ మస్క్.. అసలు విషయం ఏమిటంటే?

గ్రీన్ వాల్ట్ ట్వీట్ కు ఎలాన్ మస్క్ స్పందిస్తూ రీ ట్వీట్ చేశారు. కెనడాలో వాక్ స్వేచ్ఛను అణచివేసేందుకు ట్రూడో ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది సిగ్గుచేటు అంటూ మస్క్ అన్నారు.

Elon Musk and Canada PM Justin Trudeau

Elon Musk Anger On Canada PM : భారత్, కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెన్సీల హస్తం ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశాయి. భారత్ ఇప్పటికే కెనడా దేశస్తులకు వీసా సేవలను నిలిపివేసింది. మరోవైపు భారత్ లోని కెనడా సీనియర్ దౌత్యాధికారిని తిప్పి పంపింది. ఇలాంటి పరిస్థితుల్లో కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోపై స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు.

Read Also : Amazon Dolphins : అమెజాన్ అడవుల్లో 100కు పైగా డాల్ఫిన్లు మృతి, ఆందోళనలో శాస్త్రవేత్తలు

కెనడా ప్రభుత్వం ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్ లైన్ సెన్సార్ షిప్ నిబంధనలు అమలు చేస్తుందని ప్రముఖ జర్నలిస్ట్ గ్లెన్ గ్రీన్ వాల్డ్ అక్టోబర్ 1న ట్విటర్ లో పేర్కొన్నాడు. పాడ్ కాస్ట్ లను అందించే ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థలపై నియంత్రణ కోసం ట్రూడో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఇందులో భాగంగా ఆయా కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా నమదు చేసుకోవాలని ఆదేశించినట్లు గ్రీన్ వాల్ట్ వెల్లడించారు.

 

 

గ్రీన్ వాల్ట్ ట్వీట్ కు ఎలాన్ మస్క్ స్పందిస్తూ రీ ట్వీట్ చేశారు. కెనడాలో వాక్ స్వేచ్ఛను అణచివేసేందుకు ట్రూడో ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది సిగ్గుచేటు అంటూ మస్క్ అన్నారు.