Emotional Video : అల్జీమర్స్ నిర్ధారణ అయిన తండ్రి కోసం అతని కూతురు ఏం చేసిందంటే?

అల్జీమర్స్ నిర్ధారణ అయిన తండ్రి కోసం అతని కూతురు టాటూ వేయించుకుంది, అది చూసిన తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తండ్రితో పంచుకున్న జ్ఞాపకాలు పదిలంగా ఉంచుకునేందుకు ఆమె చేసిన పని నెటిజన్లకు కన్నీరు తెప్పించింది.

Father and Daughter Emotional Video

Father and Daughter Emotional Video : అల్జీమర్స్‌ నిర్ధారణ అయిన తండ్రి కోసం అతని కూతురు ఓ టాటూ వేయించుకుంది. అది చూసిన తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. తండ్రీకూతుళ్ల మధ్య జరిగిన ఆహ్లాదకరమైన సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

Girl inspiring Video : ఆడపిల్లలకు చదువెందుకు? అన్న తండ్రికి కూతురి ధీటైన సమాధానం చూడండి

goodnews_movement అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్  షేర్ చేసిన ఓ వీడియో అందరి మనసుల్ని కదిలించింది. తండ్రి కోసం అతని కూతురు అల వంటి గుర్తును, అతను పుట్టిన సంవత్సరం పచ్చబొట్టు వేయించుకుంది.  ఇక ఈ పోస్ట్‌ను  ‘ఆమెకు 17 సంవత్సరాల వయసు. తండ్రికి అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఆమె ఈ టాటూను క్లాస్‌లో ఉండగా డిజైన్ చేసింది. టాటూలోని ఒక అల తను, ఒక అల తండ్రి అయితే జీవితమనే ప్రయాణంలో తాము పంచుకున్న జ్ఞాపకాలకు గుర్తుగా టాటూ వేయించుకుంది. ఆ తండ్రి ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు’ అనే శీర్షికతో షేర్ చేశారు. ఈ పోస్ట్ నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Hyderabad : కూతురి పుట్టినరోజుకి 400 కేజీల టమాటాలు పంచిన తండ్రి

‘ఈ పోస్ట్ చూసి చాలా ఏడుపు వచ్చింది. మీ తండ్రికి ఇచ్చిన గొప్ప బహుమతి ఇది’ అని.. ‘ఎంత మంచి కూతురు.. తండ్రి ఆనందం చూస్తే కన్నీరు వస్తోంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. చాలామంది ఈ వీడియో చూసి ఎమోషనల్ అయ్యారు.