Hyderabad : కూతురి పుట్టినరోజుకి 400 కేజీల టమాటాలు పంచిన తండ్రి

ఓ తండ్రికి కూతురుంటే ఎంతో ప్రేమ. ఆమె పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమను వెరైటీగా చాటుకున్నాడు. 400 కిలోల టమాటాలు కొని అందరికీ పంచిపెట్టాడు. టమాటాల కోసం జనం క్యూ కట్టారు.

Hyderabad : కూతురి పుట్టినరోజుకి 400 కేజీల టమాటాలు పంచిన తండ్రి

Hyderabad :

Hyderabad : టమాటాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాటిని చూసే పరిస్థితి కానీ కొనే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే వీటిపై వస్తున్న వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. కూతురి పుట్టినరోజు సందర్భంగా ఆమె తండ్రి 400 టమాటాలు పంచడం వైరల్ అవుతోంది. ఇక వాటిని తీసుకోవడానికి జనం బారులు తీరారు.

Tomatoes as a gift : దుబాయ్ నుంచి కూతుర్ని 10 కేజీల టమాటాలు గిప్ట్‌గా తెమ్మన్న తల్లి

పుట్టినరోజంటే చాక్లెట్స్ పంచుతారు. కేక్ కట్ చేస్తారు. కానీ ఒకాయన టమాటాలు పంచారు. ఓవైపు భారీ వర్షం. గొడుగులు వేసుకుని మరీ బారులు తీరిన జనం. అక్కడ ఏం జరుగుతోందా? అని చూస్తే టమాటాలు పంచుతున్నారు. తన కూతురి పుట్టినరోజు సందర్భంగా 400 కేజీల టమాటాలు పంచాడు ఒకాయన. అలా కూతురి మీద అభిమానాన్ని అలా చాటుకున్నారు. ఇంకేముంది జనం సంబరంగా పట్టుకెళ్లారు. సాధారణంగా రూ.20 రూపాయలు పలికే టమాటా ధర ఇప్పుడు రూ.250 వరకూ వెళ్లింది. సామాన్యుడు టమాటా రుచి చూసి చాలా రోజులు అవుతోంది. ఇక టమాటాలు గిఫ్ట్‌గా ఇస్తుంటే పరుగులు తీయరు. ఇంటర్నెట్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Auto Driver Free Tamatoes : అరుణ్ ఓ మంచి ఆటో డ్రైవర్ .. టమాటాలు ఫ్రీతో పాటు ఇతని ఉచితాల లిస్టు తెలుసుకోవాల్సిందే..

చాలాసార్లు గిట్టుబాటు ధరలు లేక టమాటా పంటల్ని రైతులు రోడ్లపాలు చేసిన సంఘటనల్ని చూసాం. ఇప్పుడు కోటీశ్వరులు అవుతున్న రైతుల గురించి వింటున్నాం. టమాటాలు విదేశాల్ని గిఫ్ట్ లుగా తెప్పించుకోవడాలు.. పుట్టినరోజులకి టమాటాలు గిఫ్ట్ లు‌గా ఇవ్వడాలు వింతలన్నీ జరిగిపోతున్నాయి. ఇంకా ఈ రేటు ఎంతకాలం ఇలాగే ఉంటుందో?  ఇంకా ఎన్ని టమాటా కథలు వినాలో?

 

View this post on Instagram

 

A post shared by Wirally (@wirally)