Pakistan : ప్రధాని పోస్టు ఊడుతుందా ?

పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం పొంచి ఉంది. మరో వారం రోజుల్లో ఆయన ప్రధాని పోస్టు ఊడడం ఖాయంగా కనిపిస్తోంది.

Pak Pm

Imran Khan : పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం పొంచి ఉంది. మరో వారం రోజుల్లో ఆయన ప్రధాని పోస్టు ఊడడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఐఎస్‌ఐ చీఫ్‌గా కరాచీ కార్ప్స్ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీమ్‌ అహ్మద్‌ అంజూమ్‌ను నియమిస్తూ, ఆ స్థానంలో ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ను పెషావర్‌ కార్ప్స్‌ కమాండర్‌గా నియమిస్తూ పాక్ ఆర్మీ చీఫ్‌ బాజ్వా నిర్ణయం తీసుకోవడంతో వివాదం మొదలైంది. ఈ నియామకాలను బాజ్వా ఏకపక్షంగా చేశారని ఇమ్రాన్‌ వర్గం వాదిస్తోంది.

Read More : Cow : ఆవుల కోసం అంబులెన్స్ ..ఏ రాష్ట్రంలో తెలుసా ?

అఫ్ఘాన్‌లో తాలిబాన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న సమయంలో హామీద్‌ కాబుల్‌లో చక్రం తిప్పాడు.  అందుకే హమీద్‌నే మరికొంతకాలం కొనసాగించాలని ఇమ్రాన్‌ భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే హామీద్‌ను ఎల్లకాలం ఒకే పోస్టులో ఉంచడం సాధ్యం కాదని ఇమ్రాన్‌కు బాజ్వా సూచించారు. దీనికి ఇమ్రాన్‌ అంగీకరించలేదని.. అదే బాజ్వాకు కోపం తెప్పించినట్లుగా తెలుస్తోంది.

Read More : Post-Mortem : ఇకపై రాత్రి పూట కూడా పోస్టుమార్టం.. కేంద్రం కీలక నిర్ణయం

అందుకే అయన్ను గద్దె దింపాలని బాజ్వా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పాక్ మీడియాని చెప్పుచేతల్లో పెట్టుకున్న ఇమ్రాన్ తన వైఫల్యాలు, ప్రభుత్వ అరాచకాలు వెలుగు చూడవని అనుకున్నారు. కానీ విపక్ష పార్టీలు ఇంటర్నేషనల్ మీడియాను, సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ఇమ్రాన్ ఖాన్ గుట్టు రట్టు చేస్తున్నాయి. దీంతో ఇమ్రాన్‌కు కష్టాలు మొదలయ్యాయి.