Louisiana : తప్పిపోయిన 100 ఏళ్ల తాబేలు మళ్లీ ఫ్యామిలీని కలిసింది.. ఎలా అంటే?

తప్పిపోయిన 100 సంవత్సరాల తాబేలు తిరిగి తన యజమానులను చేరింది. అంత ఈజీగా ఎలా చేరుకోగలిగింది? అంటే.. 'ది ప్యారిష్ ఆఫ్ అసెన్షన్' జంతు సంరక్షణ బృందం దానిని కాపాడింది.

Louisiana

Louisiana : తప్పించుకుని పారిపోయిన తాబేలు తిరిగి కుటుంబానికి చేరడం అంటే చిన్న విషయం కాదు. జంతు సంరక్షణ బృందం ‘ది ప్యారిష్ ఆఫ్ అసెన్షన్’ సాయంతో తిరిగి తన యజమానులను చేరింది.

World Environment Day 2023 : ప్లాస్టిక్ బాటిల్స్‌తో భారీ తాబేలు .. పర్యావరణం కోసం సందేశం..
పారిష్ ఆఫ్ అసెన్షన్ బృందానికి ఓ కాలువ దగ్గర 100 సంవత్సరాల వయసున్న తాబేలు కనిపించింది. దీని గురించి ఆ బృంద సభ్యులు ఫేస్‌బుక్ లో వివరాలు పంచుకున్నారు. ‘అందమైన ఆఫ్రికన్ తాబేలును మా జంతు సంరక్షణ బృందం రక్షించింది. అసెన్షన్ పారిష్ షెరీఫ్ కార్యాలయం సమీపంలోని న్యూ రివర్ కెనాల్‌లో కష్టంలో ఉన్న తాబేలు వారికి కనిపించింది’ అని పోస్ట్ చేసారు. ఈ పోస్టుకి అదనంగా ‘ఇద్దరు జంతు సంరక్షణ అధికారులు, కర్ట్ ట్రెపాగ్నియర్, ఇస్రియల్ మిల్లెట్ కాలువ నుంచి తాబేలును బయటకు తీసేందుకు APSOతో కలిసి పనిచేశారు. తాబేలును ట్రక్కులోకి ఎక్కించి సురక్షితంగా కారాస్ హౌస్-అసెన్షన్ పారిష్ యానిమల్ షెల్టర్‌కు తరలించారు. ఆఫ్రికన్ తాబేలు అక్కడ మూడు రోజులు ఉంచబడుతుంది. దీని యజమాని మూడు రోజుల లోపు రాకపోతే దీనిని దత్తతకు ఇవ్వబడుతుంది’ అని జోడించారు.

Turtle attack on woman : మహిళపైకి భయంకరంగా దాడి చేసిన తాబేలు

ఈ పోస్ట్ చూసిన వెంటనే దీని యజమాని ది పారిష్ అసెన్షన్‌ను సంప్రదించి దానిని తీసుకువెళ్లేందుకు వచ్చాడు. తప్పిపోయిన తాబేలు తిరిగి దొరకడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అంతేకాదు ది ప్యారిష్ ఆఫ్ అసెన్షన్ బృంద సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘తాబేలు తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నందుకు ఆనందంగా ఉంది.. ఈ వారంలో చూసిన బెస్ట్ పోస్ట్’ అంటూ జనాలు కామెంట్లు పెట్టారు. ఇంతకీ ఆ ఓల్డ్ టార్టాయిస్ పేరు చెప్పలేదు కదా.. బిస్కెట్‌ అట. 

ట్రెండింగ్ వార్తలు